తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా సిద్ధం శెట్టి సాజన్
బెల్లంపల్లి( మంచిర్యాల జిల్లా) : బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిద్ధం శెట్టి సాజన్కు తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సాజన్కు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని సాజన్ పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

