నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేకు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి జాతీయ దంత వైద్య విద్యా బోర్డు సభ్యుడిగా డా. రాజేష్ రెడ్డి నియామకం

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేకు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి జాతీయ దంత వైద్య విద్యా బోర్డు సభ్యుడిగా డా. రాజేష్ రెడ్డి నియామకం

నాగర్‌కర్నూల్ :  నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యత దక్కింది. జాతీయ దంత వైద్య కమిషన్ పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ ఎడ్యుకేషన్ బోర్డు పార్ట్‌టైమ్ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. రెండేళ్ల పదవీకాలానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నియామకం చేసింది. ఇప్పటికే జాతీయ దంత వైద్య కమిషన్ సభ్యుడిగా కొనసాగుతున్న రాజేష్ రెడ్డికి ఇది అదనపు బాధ్యత. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా దంత వైద్య విద్యా రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ బాధ్యతతో పాఠ్యప్రణాళిక రూపకల్పన, విద్యా విధానాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం లభించనుంది. దేశవ్యాప్తంగా దంత వైద్య విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని డా. రాజేష్ రెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తానని వెల్లడించారు.జాతీయ స్థాయిలో మరో కీలక పదవి దక్కించుకోవడంపై నాగర్‌కర్నూల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డా. రాజేష్ రెడ్డికి వైద్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు అభినందనలు తెలిపారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News