రహదారిపై భారీ గుంత.. ప్రమాదాలకు నిలయంగా మారిన మార్గం
15 గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు.. ఆర్అండ్బీ అధికారులు స్పందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
మనోహరాబాద్ : మనోహరాబాద్ మండలం దండుపల్లి నుంచి రంగాయపల్లి వెళ్లే మార్గంలో కొనాయపల్లి శివారులో భారీ గుంత ఏర్పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా చుట్టుపక్కల 15 గ్రామాల ప్రజలు నిత్యం హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రాత్రివేళల్లో గుంత సరిగా కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు గాయపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే ఆర్అండ్బీ అధికారులు స్పందించి వెంటనే గుంతను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


