సింగరేణి సమస్యలు పరిష్కరించాలి
శాంతిఖని గనిపై కార్మిక సంఘం ధర్నా
బెల్లంపల్లి, (మంచిర్యాల జిల్లా): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం శాంతిఖని గనిపై ధర్నా నిర్వహించారు. బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంతెన రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి సంబంధిత ప్రాంతాల్లోనే ఇన్‌వాలిడేషన్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. గనుల్లో పనిముట్లు, అవసరమైన మెటీరియల్ కొరత లేకుండా చూడాలని, పార్క్స్‌పై ఆదాయపు పన్నుకు సంబంధించి సర్క్యులర్ విడుదల చేయాలని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులందరికీ సొంతింటి పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


