ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఉపాద్యాయురాలి చేయూత

ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఉపాద్యాయురాలి చేయూత

స్టేషన్ ఘన్‌పూర్ :  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావాలని ఎంఈవో కుసుమ రమేష్ అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ శివునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అదే పాఠశాలలో సోషల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న కె రజని తన వంతు సహకారంగా రూ 40 వేల విలువైన కంప్యూటర్, ప్రింటర్‌ను శనివారం విరాళంగా అందజేశారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో కంప్యూటర్, ప్రింటర్‌ను అందించడం అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయురాలు రజని చేసిన ఈ సహకారం పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు చూపిస్తున్న చొరవ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె ప్రవీణ్ కుమార్, శ్రీనికాంత్, లక్ష్మీ ప్రసాద్, ఈ రమేష్, కృష్ణవేణి, అరుణ, శ్రీదేవి, సురేఖ, జి రవి, రాధాకృష్ణ, టి శ్రీనాథ్, నళినీబాయి తదితరులు పాల్గొన్నారు.

Views: 113

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
మల్హర్ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడోత్సవాలు-2026లో మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినీ,...
70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకుఅవగాహన
షీ టీమ్స్ నిఘా.. 75 మందికి కౌన్సెలింగ్
ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు
న్యాయ సహాయంతో సంక్షేమ పథకాలు అందరికీ అందాలి: డి. ఇందిరా ‎