ఆర్యవైశ్యుల రాజకీయ చైతన్యానికి కృషి చేస్తా
రాష్ట్ర రాజకీయ కమిటీ వైస్ చైర్మన్‌గా దాచేపల్లి శ్రీనివాసులు నియామకం
కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర రాజకీయ కమిటీ వైస్ చైర్మన్‌గా కల్వకుర్తికి చెందిన దాచేపల్లి శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రాన్ని అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దాచేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన అమరవాది లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులందరినీ రాజకీయంగా చైతన్యవంతులను చేసి, ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. సమాజ అభివృద్ధితో పాటు రాజకీయ రంగంలో ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం లభించేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. శ్రీనివాసులుకు బాధ్యతలు అప్పగించడంపై కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గంప శ్రీనివాసులు, యువజన నాయకులు ఆకారపు శివకుమార్, పోల నరేష్, కూన సంతోష్‌తో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


