మనోహరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం

అన్నదాతల్లో ఆనందం.. పంటలకు మేలు జరుగుతుందని ఆశలు

మనోహరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం

మనోహరాబాద్ :  మనోహరాబాద్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో శనివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆకాశం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. తొలుత స్వల్పంగా మొదలైన వర్షం క్రమంగా తీవ్రత పెంచుతూ అరగంటకు పైగా కురిసింది.వర్షంతో వాతావరణం చల్లబడటంతో పాటు రైతుల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఈ వర్షం కొంతమేర ప్రయోజనం చేకూరుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో కురిసిన వర్షంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాఠశాలలో నేరా చట్టాలపై  అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో నేరా చట్టాలపై అవగాహన కల్పించారు.
బాన్సువాడ : ప్రభుత్వ పాఠశాలలో శనివారం నేరచట్టాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేజీబీవీ కొత్తబాది పాఠశాలలో సురక్షిత్ బచ్చన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన అవగాహన...
ఒకే పార్టీ.. వేర్వేరు నివాళులు..!
నిజామాబాదు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్యహణ
ఆదిలాబాద్ పట్టణ రజక సంఘం అధ్యక్షుడిగా దొనకొండ నాగన్న ఘన విజయం
ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి......కొండేటి శ్రీను సిపిఐఎం జిల్లా కమిటి సభ్యులు....
రోడ్డుపై గుంత.. మురుగునీటితో దుర్గంధం.. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఒక వైపు వేట . . . మరో వైపు విచారణ