డ్రైనేజీ సమస్యకు చొరవ.. రోడ్డుపై నీరు నిలవకుండా చర్యలు
నాంపల్లి : నాంపల్లి మండల కేంద్రం నుంచి పెద్దాపురం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై గత కొంతకాలంగా డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహించడంతో రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు నిరంతరం రోడ్డుపై ప్రవహించడం వల్ల రహదారి మరింత ధ్వంసమై ప్రమాదాలకు అవకాశం ఏర్పడింది.ఈ సమస్యను గుర్తించిన నాంపల్లి గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్ బుధవారం స్వయంగా పనుల వద్ద ఉండి జేసీబీ సహాయంతో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రాకుండా కాలువ తవ్వించే పనులు చేపట్టించారు. డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్లేలా కాలువను ఏర్పాటు చేయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సర్పంచ్ స్వయంగా చొరవ తీసుకొని పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బుర్రి శ్రీను, వార్డు సభ్యులు కామిశెట్టి నాగరాజు, సిబ్బంది ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


