రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్ దే..

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి

రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్ దే..

త్రిపురారం(హాలియా) : నాగార్జునసాగర్ చరిత్రలో 17 పర్యాయాలు పంటలకు సాగు నీటిని ఇచ్చి రైతులకు అండగా నిలిచి ఆదుకున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి గుంటకండ్ల జగధీశ్వర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహాన కార్యక్రమానికి మంగళవారం మాజీ మంత్రి గుంటకండ్ల జగధీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు 9 వేల పై చిలుకు నమోదు అయ్యాయన్నారు. ఇంకా 6 వేల ఓట్లు నమోదు కావాల్సి ఉన్నదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పథకాలు ఏమో కానీ కనీసం కేసీఆర్ అమలు జరిపిన పథకాలు కూడా కొనసాగించే నిస్సాహాయ స్ధితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పాత రోజులు గుర్తు చేస్తామని చెప్పి అన్నట్టుగా మళ్లీ విద్యుత్ కోతలు, సాగునీటి కొరతతో నిజంగానే పాత రోజులను గుర్తు చేస్తుందన్నారు. నందికొండకు పక్కనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నందికొండ వాసులకు కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయలేకపోవడం ఎంతో సిగ్గు చేటు అన్నారు. నందికొండకు తాగునీటిని సరఫరా చేసి సాగర్ ని మున్సిపాలిటీగా చేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగార్జునసాగర్ నీళ్ల కొరకు ప్రజలు మళ్లీ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి దాపరించిందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని కేవలం 2 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉందని మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గంటాపథంగా అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ట్రైకార్ చైర్మెన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, ఏనుగుల రాకేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కడారి అంజయ్యయాదవ్, రిక్కల ఇంద్రసేనారెడ్డి, బాబూరావునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చౌటకూర్ :  రైతులకు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు.సంగారెడ్డి...
ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు 11కెవి వైర్లు తగిలి నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు
రాణిపేట సెయింట్ మేరీ పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
నాగారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కాంగ్రెస్ విస్తృత ప్రచారంe
మారుమూల ఆదివాసీ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఫోక్స చట్టంపై అవగాహన
అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలం ఇవ్వాలి.!