విద్యార్థులకు కుక్కకాటు నివారణపై అవగాహన
నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో కార్యక్రమం
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో కుక్కకాటు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.కుక్కకాటు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్సపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కుక్కకాటును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని జంతుశాస్త్ర విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఎల్. కోదండరాములు సూచించారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, నడుస్తున్న నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలని, ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స పొందాలని తెలిపారు. విద్యార్థులు కుక్కకాటు నివారణపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


