ఈనెల 7వ తేదీ లోపల పంట నష్ట వివరాలు నమోదు చేసుకోవాలి: ఏవో
అచ్చంపేట (నాగర్ కర్నూల్ జిల్లా ) : ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించిన నేపథ్యంలో బల్మూర్ మండలంలో పంట నష్టపోయిన రైతులు ఆన్లైన్లో ఈనెల 7వ తేదీ లోపల నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ ఒక ప్రకటనలు తెలిపారు మండలంలో పంట నష్ట వివరాల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు ప్రధానంగా రైతుల పంటలు వివరాలు డిజిటల్ క్రాఫ్ట్ బుకింగ్ లో తప్పనిసరిగా నమోదు ఉండాలని ఆయన తెలిపారు అలాగే పంట నష్ట పరిశీలన సమయంలో పొలంలో పంట తప్పనిసరిగా ఉండాలన్నారు క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగానే పంట నష్ట వివరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు రైతులు స్పందించి చివరి తేదీ తక్కువ ఉన్నందున ఆయా గ్రామాల్లో ఏఈఓ లను సంప్రదించి తమ పంట నష్ట వివరాలు నమోదు చేసుకోవాలని ఏవో నరేష్ తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


