అచ్చంపేట విద్యుత్ డి ఈ గా సుధాకర్ బాధ్యతలు స్వీకరణ
అచ్చంపేట (నాగర్ కర్నూల్ జిల్లా) : అచ్చంపేట విద్యుత్తు డివిజనల్ ( డిఈ )గా సుధాకర్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు ఇటీవల అచ్చంపేటలో కొత్తగా ఏర్పడిన విద్యుత్తు డివిజనల్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది విద్యుత్తు ఉద్యోగులు విద్యుత్తు కాంట్రాక్టర్లు తదితరుల సమక్షంలో డిఈగా సుధాకర్ బాధ్యతలు తీసుకొని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు విద్యుత్తు సమస్యలను అధిగమించి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు ఉద్యోగులు సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి మెరుగైన సేవలు అందించాలన్నారు అచ్చంపేటలో నూతనంగా ఏర్పడిన డి ఈ కార్యాలయం పరిధిలోకి కల్వకుర్తి డివిజన్ కూడా రానున్నట్లు విద్యుత్ ఉద్యోగులు తెలిపారు కార్యక్రమంలో వివిధ మండలాల ఏ ఈ లు సబ్ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


