గవర్నర్ కోటాలో అవకాశం కల్పించాలి.
బీసీ సంఘాల డిమాండ్.
పరకాల : రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల్లో నియమించనున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీలలో ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కు అవకాశం కల్పించాలని బీసీ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పరకాల పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. విద్యావేత్త సామాజిక సేవకుడు అయినటువంటి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కు ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని వారు కోరారు. పద్మశాలి కులంలో పుట్టిన ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకనం చేసిన దార్శనికుడని అలాంటి ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే పేద ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందని వారు గుర్తు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సిరిసిల్లలో పద్మశాలీలకు మేధావులకు అవకాశం కల్పిస్తానని చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేసి గడ్డం భాస్కర్ కు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాలకు చెందిన నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గ పరిధిలో గల గ్రామంలో జన్మించిన ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మొదటి నుండి ఎన్నో రకాలైన సేవలో పాల్గొన్నారనీ బీసీ సంఘం ఎంఎన్ మూర్తి ఓ బి సి ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఆనగంటి ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గునుగంటి రవి ఎక్స్ పరకాల డివిజన్ గీత పారిశ్రామిక సంఘం నల్లెల్ల బిక్షపతి వైస్ ప్రెసిడెంట్ ఎస్పీ బీసీ కాదు రఘువీర్ మాజీ మచ్చ పారిశ్రామిక సంఘం అధ్యక్షులు బైరి రవి ఓబీసీ యూత్ ఆర్గనైజేషన్ సాయికుమార్ జి సునీల్ ఓ బి సి యూత్ కన్వీనర్ నాయకులు గుర్తు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

