త్వరలో 40వేల మంది జర్నలిస్టులతో 'మహా జాతర' ...  

- జర్నలిస్టు సంఘాల (జేఏసీ) ఐక్య కార్యచరణ కమిటీ తీర్మానం... 

 

e100e90d415244859e0cb593ecaa6201

జర్నలిస్టులకు ఈ వసతులన్నీ కల్పించండి..! 

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రసార సాధనాలలో పనిచేసే వారందరికీ అక్రెడిటేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఉచిత విద్య, వైద్యంతో పాటు జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్, 60 ఏళ్ళు పై బడిన వారందరికీ పెన్షన్ పథకం, ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేయాలని, సుమారు 40 వేల మంది జర్నలిస్టులతో 'మహా జాతర' నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించి, జర్నలిస్టులు ఇద్దరి వ్యక్తుల చేతుల్లో కీలు బొమ్మలం కాదంటూ.. సభ ఘనంగా నిర్వహిచాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 48 సంఘాలు పాల్గొన్నాయి. 

జివో 252ను వెంటనే తప్పులన్నంటినీ సరి చేయాలి 

ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన పాశం యాదగిరి మాట్లాడుతూ.. సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే అంతర్గత ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా అక్రెడిటేషన్ నాటకానికి తెర లేపిందని, జివో 252ను వెంటనే తప్పులన్నంటినీ సరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధ్యక్షోపన్యాసం చేసిన మామిడి సోమయ్య మాట్లాడుతూ... గత పాతేకేళ్ళ క్రితం ఉన్న సమస్యలే నేటికీ ఉన్నాయని, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో అసలు సమస్యలే లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని ఆయన కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.కోటేశ్వర్ రావు మాట్లాడుతూ... ఈ ప్రభుత్వ ఏర్పాటులో  కేబుల్ టీవీ, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పాత్ర మరువలేనిదని, గతంలో జర్నలిస్టుల వ్యతిరేకంగా ఉన్న అన్ని జీవోలను అంచెలంచెలుగా ఢిల్లీలో ధర్నాలు చేసి వాటిని రద్దు చేయించామని, ఇప్పుడు జరుగుతున్న అక్రెడిటేషన్ రాద్దాంతాలకు వెంటనే ఆపు చేయాలని, సమస్యని సామరస్య పూర్వకంగా పరిష్కారించాలని ఆయన అన్నారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జర్నలిస్టులు అందరూ తమ చేతుల్లో ఉన్నారని చెప్పుకొని పదవులు పొందుతున్నారని, వీళ్ళ అవకాశ వాద రాజకీయాల కారణంగా ప్రభుత్వం కళ్ళు కప్పి పబ్బం గడుపుకుంటున్నారని, పాతికేళ్ళుగా ఏం చేయలేక, ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని, జర్నలిస్టుల మహా జాతరతో వాళ్ళ బతుకు బయట పెడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పులిపలుపుల ఆనందం, కె.కరుణాకర్, వెంకటరత్నం, కోలా శ్రీనివాస్, కన్నూరి రాజు, పడాల వంశీ, ఖమ్మంపాటి సాయి చందర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్ గౌడ్, కందుకూరి యాదగిరి, బి.రమేష్ కుమార్, ఎం. శ్రావణ్ కుమార్, బందేల రాజశేఖర్, కొండా శ్రీనివాస్, తన్నీరు శ్రీనివాస్, ఏఐడబ్ల్యూజెఎ ప్రతినిధులు సిహెచ్.వెంకటేశ్వర్లు, పురుషోత్తం, రాజు నరసింహ, డివిఐన్. ప్రసాద్, టిజేఎస్ఎస్ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి కీర్తి సంతోష్ రాజ్, బాపట్ల కృష్ణమోహన్, మహిళా కోఆర్డినేషన్ మమతారెడ్డి, భాగ్య

నగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజనర్సింహ, సి.హెచ్.శ్రీధర్, ఎం.పురుషోత్తం, డా.కే.అంజిరెడ్డి, పి.సుధాకర్ గౌడ్, వి.నరేష్, పి.అశోక్ గౌడ్, నీలం బాలరాజ్, కే.రవీందర్ గౌడ్, సత్యం రాంపల్లి, వెంకట యోగి రఘురాం, మహేష్ కుమార్, సంతోష్ కుమార్, బి.ఎన్.చారి, రాజు, రియాజ్, ఎం.డి.కరీం, సవల్కేర్ శ్రీధర్, మెడిశెట్టి వెంకటేశ్వర్, ఎస్.శ్రీనివాస్ రావు, ప్రమోద్ కుమార్, జె.బాలకృష్ణ, నరేష్ బుచ్చి రెడ్డి, ఎస్.శివప్రసాద్ గౌడ్, లక్వుద్దీన్, శోభన్ బాబు, వేణుగోపాల్, ఆర్.వి.ఎల్.ఎన్.ప్రసాద్, దారం జగన్నాథం రెడ్డి, అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నంబి పర్వతాలు, సి.హెచ్.శ్రీనివాస్, రావికంటి శ్రీనివాస్, కె.బాపురావు, వివిధ జిల్లాల ప్రతినిధులు, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

*జర్నలిస్టు సంఘాల జేఏసీ ఏర్పాటు సభ్యులు*

కన్వీనర్లుగా మామిడి సోమయ్య, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, మమతా రెడ్డి, బైసా సంగీత, కో-కన్వీనర్లుగా శ్రీనివాస్, చింతల శ్రీనివాస్, కందుకూరి యాదగిరి, సత్యం గౌడ్, లాయఖుద్దీన్, పురుషోత్తం, చింతకాయల వెంకటేశ్వర్లు, రాజనర్సింహ, డి.ఎల్. ప్రసాద్ లతో పాటు పలువురు కో- ఆర్డినేటర్లతో జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సందర్భంగా ఏర్పడింది.

Views: 181

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పౌర విధులు, హక్కులు, బాధ్యతల ప్రాముఖ్యత పై  విద్యార్థుల గ్రామ సర్వే పౌర విధులు, హక్కులు, బాధ్యతల ప్రాముఖ్యత పై విద్యార్థుల గ్రామ సర్వే
    వికారాబాద్  : పౌర అవసరాలు, విధులు, బాధ్యతలు అనే అంశంపై స్వామి వివేకానంద గురుకుల్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విద్యార్థులు గ్రామ సర్వే నిర్వహించారని యజ్ఞ
కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్..
పర్యాటక ప్రదేశం ప్రారంభించిన మంత్రి సీతక్క.
క్రికెట్ పోటీలు ప్రారంభించిన కొండూరి రవీందర్ రావు
తానూర్ మండలంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత; రాత్రి 3-ఫేజ్ కరెంట్ అందజేత
శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నాయకులు
అంధుల జీవితం నేటి సమాజానికి ఆదర్శం