Bhuvanagiri - Vision Andhra

డిజిటల్ క్రాప్ సర్వే (పంట నమోదు)ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఏవో పాండురంగాచారి
అడ్డగూడూరు, : రైతులు సాగు చేసిన పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా (పంట నమోదు) చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పాండురంగాచారి కోరారు. మండల కేంద్రంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన డీసీఎస్ యాప్ ద్వారా ప్రతి రెవిన్యూ గ్రామానికి ఒక ప్రైవేట్ సర్వేయర్ ను నియమించి పంట వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో రైతుల పొలాల వద్దకు వచ్చి పంట వివరాలు సేకరించి ఆన్లైన్లో పంట ఫోటో తీసి నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులందరూ ప్రైవేట్ సర్వేయర్స్ ను వినియోగించుకొని పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుందని పంటల నమోదుకు ఈ నెల 30 వరకు చివరి తేదీ అని తెలిపారు. గ్రామాల వారీగా సర్వేయర్లు ఇలా అడ్డగూడూరుకు మేకల పవన్ (1 నుండి 600 సర్వే నెంబర్ వరకు), కురిమిల్ల కరుణాకర్ (601 నుండి 980 సర్వే నెంబర్ వరకు), కంచనపల్లి-సుంకరబోయిన విజయ్ కుమార్, రేపాక- మార్లేని నరేష్, జానకిపురం- దేవనబోయిన వెంకన్న, చిన్నపడిశాల-చుక్కా శ్రీకాంత్, చౌల్లరామారం- చిలుక ప్రభాకర్, చిర్రగూడూరు-బండి నరేష్, కోటమర్తి-గూడ లింగస్వామి, ధర్మారం- కత్తుల అమూల్యకుమార్, వెల్దేవి-నిమ్మల పవన్ చంద్ర, గట్టుసింగారం-జంపాల మణికుమార్ (1 నుండి 600 సర్వేనెంబర్), మారోజు నందకిషోర్ (601 నుండి 800 సర్వే నెంబర్)ల వరకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే గ్రామాల్లోని ఏఈఓలను సంప్రదించాలని అన్నారు. అడ్డగూడూరు, రేపాక, కంచనపల్లి, ధర్మారం, గట్టుసింగారం, వెల్దేవి గ్రామాలకు ఏఈవో ఎ. అనూష, జానకీపురం చిన్నపడిశాల, చౌల్లరామారం, చిర్రగూడూరు, కోటమర్తి గ్రామాలకు ఏఈవో ఎస్.అక్షర అందుబాటులో ఉంటారని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులపై కర్రె వెంకటయ్య ఫైర్‌
యాదగిరిగుట్ట: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టులను బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నాయకులను అరెస్టులతో అడ్డుకోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ అణచివేత వైఖరికి నిదర్శనమన్నారు.మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో అసెంబ్లీ వద్ద గెంటివేయించడం ప్రభుత్వ వికృత చర్యలకు అద్దం పడుతోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం లేకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ సమావేశాలనుంచి సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.“కాంగ్రెస్‌ అరాచక పాలన ఇంకెన్నాళ్లు?”అని ప్రశ్నించిన వెంకటయ్య.. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ తీరును నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు.అరెస్ట్ అయిన వారిలో రామాజీపేట సర్పంచ్ దేవేందర్,పెద్ద కందుకూర్ సర్పంచ్ గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్, పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి,శ్రీధర్,వాసం రమేష్, సతీష్ బట్, తోటకూరి మల్లేష్, రాజేష్ తదితరులు ఉన్నారు.

పినపాకలో వైద్యం గాల్లో
పినపాక : పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ డాక్టర్ వస్తారో రారో తెలియని పరిస్థితి. సమయపాలన పూర్తిగా కరువైంది. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు PHC లో వైద్యాధికారి అందుబాటులో ఉండాలి. ఇది ప్రభుత్వ నిబంధన. కానీ పినపాకలో మాత్రం ఉదయం 11 గంటలైనా చాంబర్ ఖాళీగానే ఉంటోంది. మీడియా వెళ్లి చూడగా డాక్టర్ టేబుల్, కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. బయట మాత్రం వృద్ధులు, రోగులతో తల్లులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
రోగుల ఆవేదన:
"పొద్దున 9 గంటకే వచ్చాను బాబు, ఇప్పుడు 11అయింది. డాక్టర్ గారు ఇంకా రాలేదు. నా సమస్య ఎవరికి చెప్పుకోవాలి అంటూ గడ్డంపల్లి గ్రామానికి చెందిన  ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మరో వృద్ధులు , చిన్నారులు" వివిధ ప్రాంతాల   నుంచి వచ్చాము, డాక్టర్ లేడు" అని వాపోయారు.

- సిబ్బంది ఏమంటున్నారు?
ఈ విషయంపై అక్కడున్న సిబ్బందిని ప్రశ్నిస్తే "డాక్టర్ గారు వస్తారో రారో మాకు తెలియదు, మాకు సమాచారం లేదు" అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. దీంతో రోగులు దిక్కుతోచని స్థితిలో వెనుదిరుగుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక నరకయాతన పడుతున్నారు.ఎమ్మెల్యే వార్నింగ్ కూడా బేఖాతర్ ఇదే విషయంపై ఇటీవల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సకాలంలో హాజరు కావాలని, నిర్లక్ష్యం వీడాలని హెచ్చరించారు. అయినా పినపాకలో మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఎమ్మెల్యే హెచ్చరికను కూడా లెక్క చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పినపాక PHC లో బయోమెట్రిక్ హాజరును వెంటనే అమలు చేయాలి. వైద్యాధికారి రోజూ సమయానికి హాజరయ్యేలా DMHO, కొత్తగూడెం చర్యలు తీసుకోవాలి.ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. పేద గిరిజన ప్రజలు నమ్ముకున్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే వారు ఎక్కడికి వెళ్లాలి? జిల్లా వైద్యాధికారి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గురువులకు విద్యార్థుల ఘన సన్మానం
యాదగిరిగుట్ట: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాదువెల్లి గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు.కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు కడెం సోమయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్‌ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో సహాయ ఉపాధ్యాయుడు ఎస్‌.ఉదయ్‌కుమార్,విద్యా వాలంటీర్లు కె.బాలకృష్ణ, ఇ.వెన్నెల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల శంకుస్థాపనలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
సంస్థాన్ నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లా, మునుగోడు నియోజకవర్గం, నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో 76.20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నారాయణపురం మండలం గుడిమల్కాపురం నుండి చల్మెడ (వయా సర్వేల్, లింగం వారి గూడెం, సాయిగోని బావి) వరకు 32.90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే డబుల్ రోడ్డు అభివృద్ధి పనులకు, నారాయణపురం నుండి సర్వేల్ వరకు (5 కిలోమీటర్లు) 11 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న రోడ్డు నిర్మాణ పనులకు,, సర్వేల్ నుండి మునుగోడు మండలం పలివెల(వయా మల్లారెడ్డిగూడెం) వరకు 32.30 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు..గ్రామాల నుండి గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ కూడా 3.75 మీటర్ల వెడల్పుతో ఉండేవని రవాణా సౌకర్యాలు మెరుగై ప్రతి గ్రామంలోకి కార్లు బైకులు బస్సులు వస్తున్న నేపథ్యంలో  ఆ రోడ్లని 5.5 మీటర్ల వెడల్పు చేయాలనే ఆలోచనను తానే ప్రభుత్వానికి విన్నవించడంతో ప్రజా ప్రభుత్వం వెంటనే స్పందించడంతో మునుగోడు నియోజకవర్గం లో 5.5 మీటర్ల వెడల్పుతో రోడ్లను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు... రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మా సోదరుడు ఆర్ అండ్ బి శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం వల్లే  ఈ రోడ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. రోడ్లను అభివృద్ధి చేసే సందర్భంలో ఆయా గ్రామాల గ్రామస్తుల తో పాటు అన్ని శాఖల అధికారులు ముఖ్యం గా జర్నలిస్టులు మీడియా మిత్రులు సహకరించాలని  కోరారు..మంత్రివర్గ విస్తరణ అంశం మంత్రి పదవి ఇచ్చే అంశం అధిష్టానం చేతిలో ఉందని అధిష్టానం ఏది చెబితే అది ఫైనల్ అని మా నాయకుడు రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని  తెలిపారు.. కొండా సురేఖ అంశం కూడా అధిష్టానం చేతిలో ఉందని  అధిష్టానం ఏది చెప్తేఅది ఫైనలన్నారు... తాను ఎక్కడ మాట్లాడినా కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పై కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం జరుగొద్దనేది నా ఆలోచన అని, కష్టపడ్డ కార్యకర్తలకు ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

స్వామివారి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా
యాదగిరిగుట్ట, : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌ బుర్రా వెంకటేశం బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

పెబ్బేరు బస్టాండులో సీసీ బెడ్ పనులు ప్రారంభం
పెబ్బేరు : స్థానిక పురపాలక సంఘం పరిధిలోని  బస్టాండు ఆవరణలో చేపడుతున్న సీసీ బెడ్  నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బస్టాండు ఆవరణలో ఎత్తుపల్లాలు, గుంతల కారణంగా వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు, ప్రయాణికుల కష్టాలను స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకుపోగా రూ, 39 లక్షల 67 వేలతో   సీసీ బెడ్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ ​నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ​ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని,మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పర్వీన్ షకీల్, జములమ్మ, శివసాయి, భాగ్యలక్ష్మి శివ, వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, డిప్యూటీ ఇంజనీర్ జంగయ్య, ఏఈ సంపత్ కుమార్, కాంట్రాక్టర్ కృష్ణ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు._

మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ
యాదాద్రి భువనగిరి  : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో  మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ ) యొక్క స్మార్ట్, వినూత్న మరియు సమర్థవంతమైన అమలును ప్రోత్సహించడానికి ,నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టర్ ( డీ ఎస్ ఈ) కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అత్యుత్తమ కార్యకర్తలను గుర్తించి సత్కరించారు.ఇద్దరు జిల్లా విద్యా అధికారులు( డి ఈ ఓలు), ఇద్దరు మండల విద్యా అధికారులు (ఎం ఈ ఓ ఎస్),ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు,ముగ్గురు ప్రధానోపాధ్యాయులు,ఒక కంప్యూటర్ ఆపరేటర్ మరియు రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి సత్కరించారు.రాష్ట్ర స్థాయిలో ఈ సత్కారం పొందిన ఇద్దరు డీ.ఈ.ఓ లలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కందుల సత్యనారాయణ  మొదటి వారు. వారి ప్రశంసనీయమైన పనితీరు, అంకితభావం మరియు వివిధ స్థాయిలలో పథకం యొక్క ప్రభావవంతమైన అమలుకు గుర్తింపుగా ఈ సత్కారం అందుకున్నారు.
ఈ గుర్తింపు,చొరవ క్షేత్ర స్థాయి అధికారులు మరియు సిబ్బందిని ప్రోత్సహించడం, జవాబుదారీతనం మరియు శ్రేష్ఠతను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది.ఈ గుర్తింపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల పిల్లలకు పోషకాహార మద్దతును సమర్థవంతంగా అందించడంలో మరింత బలోపేతం చేయడంలో
ఉపయోగపడుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డా.నవీన్ నికోలస్ అన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(సర్వీసెస్ ) ఎం.మదన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి పాల్గొని అభినందించారు.

అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి -- కొండమడుగు నర్సింహ, గద్దె నర్సింహ లు పిలుపు
భువనగిరి :    అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సిపిఎం సీనియర్ నాయకులు గద్దె నర్సింహ పిలుపునిచ్చారు.  ఆదివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింహ లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ సంగు రవీందర్ చిన్ననాటి నుండే ఎర్ర జెండా నాయకత్వంలో విద్యార్థులు, యువజనలు, రైతులు, వ్యవసాయ కూలీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే దాంట్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదలకు వ్యవసాయ కూలీలకు కీలకంగా ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంను కూడా మార్చి కూలీల పొట్ట కొడుతున్నారని అన్నారు. మరోపక్క రైతులకు, పేదలకు ఉపయోగపడుతున్న విద్యుత్ సబ్సిడీని ఎత్తివేయడానికి విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చారని, రైతాంగానికి నష్టం చేసే విధంగా విత్తన చట్టాన్ని తెచ్చారని ఈ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు అనేకం ఇచ్చి వాటిని అవలు మాత్రం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు, ఇండ్లు నిర్మాణం చేసుకుంటే వాటికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వవలసిందిపోయి ఆ భూములను ఆక్రమించుకొని డబ్బులు దండుకోవడానికి పేదల ఇండ్లను కూలగోడుతున్నారని పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని లేకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, గంధమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, భువనగిరి మండల పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కొండమడుగు నాగమణి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బర్ల వెంకటేష్, వల్దాసు అంజయ్య, నాయకులు కొలుపుల వివేకనంద, ఎండి. సలీం, మధ్యబోయిన సుందర్, ఎం.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
మాయ కృష్ణ
సిపిఎం పట్టణ కార్యదర్శి
భువనగిరి.

తడక ముత్యాలు మృతి
భూదాన్ పోచంపల్లి  :  పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ గారి తండ్రి శ్రీ తడక ముత్యాలు శుక్రవారం మృతి చెందారు వారి మృతి పట్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకుటుంబ సభ్యులు నాయకులు ప్రజలు ఆకాంక్షించారు అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

సైబర్ నేరాలపై అవగాహన
యాదాద్రి భువనగిరి  : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ) ఆదేశాల మేరకు, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా కె వై సి– సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగు” అనే అంశంతో బీబీనగర్‌లో వాక్‌థాన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు కేవైసీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్బిఐ ఏజీఎం శ్రీమతి లక్ష్మీ శ్రావ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ కే. శివ రామ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీ జాకీరోద్దిన్, డి ఆర్ డి ఓ ,ఎస్ ఇ ఆర్ పి డీపీఎం శ్రీ వెంకటేశం, బీబీనగర్ ఏపీఎం శ్రీమతి మీనా, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, CFL సి ఎల్  ఎఫ్ ఫ్కౌన్సెలర్లు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైన గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం
భువనగిరి : ఈరోజు భువనగిరి జిల్లా పట్టణంలో  " గోపా "  తరఫున నూతనంగా ఎన్నికైన జిల్లాకు చెందిన గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి  " గొపా "  జిల్లా అధ్యక్షులు  దంతూరి కుమార స్వామి గౌడ్  సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగినది ఈ కార్యక్రమానికి రాష్ట్ర గోపా తరఫున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్  ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడుతూ,  "  గోపా " మన గౌడ సామాజికవర్గానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఉన్న పెద్దలను గౌరవిస్తూ, ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులు, ఎం ఎల్ ఏ లను, కాపాడుకుంటూనే భవిష్యత్తులో కొత్త వారిని తయారు చేయడానికి శాయశక్తులా క్రృషి చేస్తుందని వివరించారు. ఇంతకు ముందు జరిగిన ఎం ఎల్ ఏ, ఎం పి ఎన్నికల్లో " గోపా " తన వంతు క్రృషి లో భాగంగా, పార్టీలకు అతీతంగా మన గౌడ్ లు పోటి చేస్తున్న ప్రతీ నియోజకవర్గంలో గొప్ప పాత్ర పోసించిందని వివరించారు. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలను, సంఘాల నాయకులను కలుపుకొని భవిష్యత్ లో అత్యంత ఎక్కువ మంది ఎంపీలు, ఎం ఎల్ ఏ లను గెలిపించడానికి ప్రణాళికలు రచిస్తోంది, కాబట్టి ఇప్పుడు గెలిచిన ప్రతీ సర్పంచ్, ఉపసర్పంచ్ లు కూడా పార్టీ లకు అతీతంగా మన వారు పోటీ చేసే ఆయా నాయకులను గెలిపించుకోవడం మన బాధ్యత అని తెలియచేశారు.
ప్రధాన కార్యదర్శి జి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మనకు మన వారుఎవరైనా సహాకరించకపోయినా , అలాంటి వారిని నిందించకుండా,  అన్ని రకాల వ్యక్తులను, కలుపుకుని, సేవాకార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు దగ్గరగా ఉంటూ మన విలువలు పెంచుకుంటూ, అందరితో స్నేహం పెంపొందించుకోవడానికి ప్రయత్నం  చేయవలసిందిగా సూచించారు.
అలాగే అగ్రవర్ణాల వారిని నిందించకుండా ఆ సమయాన్ని మన వారిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కెటాయించినచొ మనకు ఉపయోగపడి, మనలో మనకు ఐక్యతకు దోహదపడుతుందని వివరించారు. ఉపాధ్యక్షులు చెక్కళ్ల మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ మనిషి యొక్క ఎదుగుదలకు, మనోధైర్యాన్ని, మనో బలాన్నే కాకుండా,  ఆర్థికంగా బలపడానికి  కూడా ఉన్నత చదువులు ఎంతో దోహదం చేస్తాయి కాబట్టి   మనం  మన వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించాలని కోరారు. అంతె కాకుండా మనం ఇంతకు ముందు పేరు చివర గౌడ్ అని వ్రాయక పోయినా, కనీసం పేరు చెప్పేటప్పుడు అయినా గౌడ్ అని సంబోధిస్తూ పేరు తెలియచేయాలని తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ యల్మకంటి మీరయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల రాజు గౌడ్, కోశాధికారి నల్లమాస ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షులు తిరుమల క్రిష్ణ గౌడ్, అత్తిలి లక్ష్మీ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగినది.