Nagar Kurnool - Vision Andhra

బిజినపల్లి లో పురాతన పద్ధతిలో వినాయక నిమజ్జనం వేడుకలు
నాగర్ కర్నూల్  : బిజినపల్లి గ్రామంలోని సంతోష్ నగర్ కాలనీలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఉంచి, డోలు చప్పుళ్లతో, భజనలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. భక్తులు బొడ్డెమ్మలు , కోలాటాలతో సందడి చేశారు. విజన్ ఆంధ్ర రిపోర్టర్ శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు పలకరించగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా పురాతన పద్ధతిలోనే నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ వేడుకలకు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ప్రస్తుత వాతావరణంలో డీజే శబ్దాల వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎద్దుల బండి, డోలు వాయిద్యాలు, అడుగుల భజనలతో శాంతియుతంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. మరుగునపడుతున్న మన పురాతన పద్ధతులను ప్రస్తుత సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

బిజినపల్లి పోలీసు స్టేషన్ లో ఘనంగా వినాయకుని నిమజ్జన వేడుకలు
జిల్లా నాగర్ కర్నూల్   బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి నిమజ్జన వేడుకలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, బిజినపల్లి ఎస్ఐ షంషుద్దీన్, తాడూరు ఎస్సై రాములు, తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో కల్మషం లేని వాతావరణాన్ని అలవర్చుకోవాలని, వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సూచించారు.పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి వినాయకుడిని  ఊరేగింపుగా తీసుకవెళ్లి నిమజ్జన వేడుకలు పూర్తి చేశారు.ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మాజీ సర్పంచ్ గంగానమోని తిరుపతయ్య, పోలీస్ సిబ్బంది, విలేకరులు, ప్రజలు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయి అథ్లెట్‌గా కొడవత్ స్వప్న - స్వర్ణ పతకం కైవసం
నాగర్ కర్నూల్, : పేదరికాన్ని జయించి పట్టుదలతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కొడవత్ తండాకు చెందిన కొడవత్ స్వప్న అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పుదుచ్చేరిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 బాలికల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేస్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి,ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగిన స్వప్న ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. స్వప్న విజయంతో కొడవత్ తండాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, క్రీడాభిమానులు ఆమెను అభినందిస్తున్నారు.

ప్రతి మారుమూల ప్రాంతానికీ మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలి
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతానికి మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో బీఎస్ఎన్ఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నల్లమల్ల అటవీ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్ వర్క్ విస్తరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నల్లమల్ల, కలెక్టరేట్, మారుమూల ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ శాచ్యురేషన్ మోడ్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూమి, అనుమతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.నల్లమల్లలో టవర్ల ఏర్పాటుతో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అటవీ శాఖ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ టవర్లకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనులకు మెరుగైన నెట్ వర్క్ సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ, డిజిటల్, అత్యవసర సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.అటవీ, రెవెన్యూ శాఖలు బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు
నాగర్ కర్నూల్,  : నాగర్ కర్నూల్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వ్యవసాయానికి సరైన సమయంలో విద్యుత్ సరఫరా అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో పంటలకు నీరు పెట్టే సమయంలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని సంబంధిత మంత్రిని కోరారు. వ్యవసాయ పనులకు నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో కీలకమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు సాగుకు అవసరమైన విద్యుత్, నీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.

దసరా నవరాత్రి ఉత్సవ కమిటీ ఎన్నిక
కల్వకుర్తి  : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నూతన ఉత్సవ కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవాలయ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు వివిధ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కలిమిచర్ల గోపాల్, ప్రధాన కార్యదర్శులుగా నారాయణ రాజు, పానుగంటి నవీన్, బాదం రాఘవేందర్, కోశాధికారులుగా గుబ్బ కిషన్ కుమార్, వాస మనీష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కలిమిచర్ల గోపాల్ మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వాస శేఖర్, గందె రవి, కలిమిచర్ల రాఘవేందర్, గుబ్బ ప్రభాకర్, ఇరివెంటి రమేష్, జూలూరి ప్రకాష్, జూలూరి సత్యనారాయణ, దాచేపల్లి మనోహర్, దాచేపల్లి తిరుపతయ్య, పీఎస్ఎన్ గుప్తా, మాచిపెద్ది అశోక్, శివ్వ రాఘవేందర్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

దోమలు, వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించండి
​పెంట్లవెల్లి  : పెంట్లవెల్లి మండల జటప్రోలు గ్రామంలో ఎదురవుతున్న తీవ్ర పారిశుధ్య, రక్షణ సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతూ జటప్రోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు గ్రామ యువకులు, పెద్దలు కలిసి గురువారం వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ... గ్రామంలో దోమల ఉధృతి తీవ్రంగా పెరిగిపోయిందని, ప్రజలు రోగాల బారిన పడకముందే తక్షణమే దోమల నివారణ మందు (ఫాగింగ్) పిచికారీ చేయించాలని కోరారు. అలాగే గ్రామంలో వీధి కుక్కలు వందల సంఖ్యలో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు, బాటసారులపై ఇవి దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ప్రజా ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ యంత్రాంగం తక్షణమే స్పందించి ఈ రెండు సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు సులిగిరి తరుణ్, మంజునాథ్, నలవల శివకుమార్, ప్రకాష్, బన్నీ, శివతో పాటు గ్రామ పెద్దలు హనుమంతు, గోపాల్ మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

వట్టెంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా
జిల్లా నాగర్ కర్నూల్ :  ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో సర్పంచ్ జ్యోతి శంకర్, బీజేపీ నాయకులు మైకం చంద్రకళ, వినోద్, హరి ప్రసాద్, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, వడ్డే రాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.ఈ శిబిరంలో మొత్తం 32 మంది యువకులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రధాని మోదీ సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి శంకర్ మాట్లాడుతూ రక్తదానం మించిన దానం లేదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.

ఎర్రకుంట తండాలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఎర్రకుంట తండాలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కృష్ణా నాయక్ జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి, అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రక ఘట్టమని, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు ఇదేనన్నారు. ప్రజా పాలన స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ విజయ్ కుమార్, వార్డు సభ్యులు శ్రీను, రఘు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

బిజినపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
నాగర్ కర్నూల్ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజినపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇందిరా రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం సిద్ధించిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పంచాయతీ పాలకవర్గం పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డమీది మహేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
నాగర్ కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరులకు నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ప్రభుత్వ పథకాల ప్రగతిపై వెల్లడించిన వివరాలు: మహాలక్ష్మి, గృహజ్యోతి: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా జిల్లాలో 10.56 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని, రూ.499.85 కోట్లు ఆదా అయ్యిందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్‌తో 1.18 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, గృహజ్యోతి కింద 1,15,461 కుటుంబాలకు జీరో బిల్లులు వచ్చాయని తెలిపారు. రేషన్, ఆరోగ్యశ్రీ: రేషన్ కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 2,79,133 కార్డుల పరిధిలో 8,99,385 మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, జిల్లాలో 44,115 మందికి రూ.117.60 కోట్లతో వైద్య సేవలు అందించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు: మొదటి విడతలో 11,922 ఇళ్లు మంజూరు కాగా 9,809 మందికి పత్రాలు ఇచ్చామని, 5,269 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 2,361 పూర్తయ్యాయని, రూ.197.24 కోట్లు విడుదల చేశామన్నారు. రైతు భరోసా: వానాకాలం 2026-27 కింద 3.08 లక్షల మంది రైతులకు రూ.422.56 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశామని, రైతు బీమా కింద 1,141 కుటుంబాలకు రూ.57.05 కోట్లు చెల్లించామని తెలిపారు. విద్య, సాగునీరు: జిల్లాలో 753 ప్రభుత్వ పాఠశాలల్లో 48,798 మంది విద్యార్థులు ఉన్నారని, SSCలో 99.03 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ.5,861 కోట్లు కేటాయించి 3.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపి ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
నాగర్ కర్నూల్,:తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీడా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని, స్వాతంత్ర్య సమరయోధుల వీరోచిత పోరాటాలను స్మరించుకోవాలన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి యోధులు చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనంలో కీలక పాత్ర పోషించారని, చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.జిల్లా పోలీసుల పనితీరు బాగుందని, మరింత ఉత్సాహంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పోలీసు అధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.