Medak - Vision Andhra

తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
శివంపేట (మెదక్): శివ్వంపేట మండల కేంద్రంలో తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజారెడ్డి మాట్లాడుతూ శాసనసభాపతి పదవికి గౌరవం ఉండాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాత మధును ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, చింతల వెంకటరామిరెడ్డి, కమలా పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ
శివ్వంపేట, (మెదక్): మెదక్ జిల్లా,శివ్వంపేట మండల కేంద్రంలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొని మండలంలోని పలు గ్రామాలకు చెందిన 125 మంది గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, తల్లులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు రాజన్న ఫౌండేషన్ తరఫున నిరంతరం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు.

తల్లి మరణం తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య
పెద్ద శంకరంపేట్  : మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్ద శంకరంపేట్ మండలంలో విషాదాన్ని నింపింది. మండలంలోని మక్తలక్ష్మాపూర్‌కు చెందిన బేతమ్మ (45) కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం. తల్లి మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కుమారుడు ప్రవీణ్‌ కూడా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. వరుస విషాద ఘటనలతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బేతమ్మ కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లి మృతితో తీవ్రంగా కలత చెందిన కుమారుడు కూడా ఈ దారుణ నిర్ణయానికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-18 ఖో ఖో పోటీలు ఘనంగా ప్రారంభం
ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-18 ఖో ఖో పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 348 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పీఆర్‌టీయూ మెదక్ జిల్లా సెక్రెటరీ సామ్యా నాయక్ మరియు టీజీడబ్ల్యూఆర్‌జేసీ ప్రిన్సిపాల్ బసవరాజు ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ గౌడ్ ట్రెజరర్ నాగ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను అభినందిస్తూ, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులు, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సీఎస్ఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పోలబోయిన నరేష్
అక్కన్నపేట : భారత కేంద్ర విద్యార్థి సమాఖ్య (సీఎస్ఎఫ్‌ఐ) కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కా. పోలబోయిన నరేష్‌ను నియమించినట్లు భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (క్లాస్ స్ట్రగుల్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కా. లింగంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సీఎస్ఎఫ్‌ఐ నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సాధనతో పాటు విద్యార్థుల హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాల్లో నెలకొన్న సమస్యలపై కూడా సీఎస్ఎఫ్‌ఐ నిరంతరం ఉద్యమాలు చేపడుతోందన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం వారిని సంఘటితం చేసి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎన్‌ఈపీ–2020 రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ–2020)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని లింగంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థుల విద్యకు ఆటంకం కలిగించే విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలి
అక్కన్నపేట,: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేయాలని ఎంసీపీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ఉదారీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలని అన్నారు.రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో భూ సంస్కరణలు అమలు చేసి భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.కార్మిక చట్టాల సవరణలు, హేతుబద్ధీకరణ పేరుతో కార్మికుల హక్కులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని అన్నారు. చిన్నతరహా, స్వదేశీ పరిశ్రమలను గుత్తాధిపత్య, బహుళజాతి సంస్థల నుంచి రక్షించాలన్నారు.మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విప్లవాత్మక కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ శాస్త్రీయ సోషలిజం స్థాపన లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

పాత పద్ధతిలోనే ఎరువుల విక్రయాలు చేపట్టాలి
అక్కన్నపేట,  : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌’ డిజిటల్ విధానం ద్వారా ఎరువుల విక్రయాలు చేపట్టడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకుడు కంసాని రాజిరెడ్డి ఆరోపించారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువుల విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.డిజిటల్ విధానం కార్పొరేట్ వ్యవసాయదారులకు అనుకూలంగా ఉందని, చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని ఆయన అన్నారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆన్‌లైన్ సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని పాత పద్ధతిలో విక్రయాలు కొనసాగించాలని కోరారు.రైతులకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను సడలించి, సాగు సమయంలో అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు బుర్ర రవి, లింగాల పరశురాములు, చింతల పరశురాం రెడ్డి, తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ వాయిదా..
అక్కన్నపేట, : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేయడంపై జాయింట్ స్ట్రగుల్ కమిటీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ పరిణామం తాము ముందుగానే ఊహించినదేనని జాయింట్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర చైర్మన్ టి. ప్రభాకర్, సమన్వయకర్త సయ్యద్ షౌకత్ అలీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు బి. మురళీధర్ గౌడ్, డి. హరికృష్ణ, దేవేందర్, ఎస్సీ కుమాసిర్, ఎస్.ఎ. జలీల్, ఆర్. రోహిత్ నాయక్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

జేఏసీల వైఫల్యం బట్టబయలు

తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రస్తుతం ఉన్న రెండు ఉద్యోగ జేఏసీలు ఘోరంగా విఫలమయ్యాయని వారు విమర్శించారు. సమస్యల పరిష్కారం పట్ల జేఏసీ నాయకత్వాలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమైన సమయంలో చలో హైదరాబాద్‌ను వాయిదా వేసేవారు కాదన్నారు. ఆందోళనను వాయిదా వేయడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీశారని శ్రీనివాస్ఆరోపించారు.

ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు

గతంలో మాదిరిగానే ఉద్యమాలను నామమాత్రంగా నిర్వహించి మధ్యలోనే విరమించడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటోందని ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జాయింట్ స్ట్రగుల్ కమిటీని పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చిత్తశుద్ధితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సంఘాలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల పోరాటాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడితే నాయకత్వాలు ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

ఉత్తర్వులు వచ్చే వరకు సమరం

పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జాయింట్ స్ట్రగుల్ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధనే ధ్యేయంగా జరిగే ఈ పోరాటంలో ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ భాగస్వామి కావాలని కోరారు. ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను తిప్పికొట్టి, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రకటనను వెల్లడించారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
చేగుంట : చేగుంట ఉత్తమ ఉపాధ్యాయులు గా  ఎన్నికైనటువంటి వారిని ఘనంగా సన్మానించిన ఎంపీడీవో  చిన్నారెడ్డి, ఎంఈఓ నీరజ ,  ఎంపీడీవో చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది, దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మింపబడుతుందని  అన్నారు. మండల విద్యాధికారి నీరజ మాట్లాడుతూ  సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని, సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచలంచలుగా ఎదిగి రాష్ట్రపతిగా అయి ఆ వృత్తికి వన్నెతెచ్చిన  మహానుభావుడు అని అన్నారు. సర్పంచ్ సండ్రుకు స్రవంతి సతీష్ మాట్లాడుతూ అన్ని వృత్తులను తయారు చేసే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు అని అన్నారు . ఉపసర్పంచి మమ్మద్ రఫీ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల కీలకపాత్ర పోషించాలని, అన్నారు. మండల ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైన ఉపాధ్యాయులు పీజీహెచ్ఎం లతాంబరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రకళ, సిద్ధి రాములు, సప్న, శ్రీవాణి, కాజా మొయినుద్దీన్, వెంకటేశ్వర్లు, సంధ్యారాణి, శ్రీనివాస్ రావు, ప్రభాకర్, శ్రీనివాస్ గౌడ్, వెంకయ్య, పూర్ణచందర్, తిరుపతి, నర్సింలు, ఎల్లయ్య, సంగీత, జ్యోతిర్మయి, చరందాస్, వనిత, శ్రీలత, స్వప్న, రంజిత్, నాగరాజు, గిరిజ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన, సత్యనారాయణ, విట్టల్ రెడ్డి, రవిబాబు మరియు సి అర్ పి రమేష్, సంతోష్ రెడ్డి, ప్రవీణ్, వినోద లను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణారావు , వెంకటరాంరెడ్డి, చందాయిపేట హెచ్ఎం విట్టల్ రెడ్డి, ఉపాధ్యాయుల సంఘాల, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం నవాత్ సురేష్, సిద్ది రెడ్డి, నాయకులు,  గజగట్లనాగరాజు, కొంతాలపల్లి పెంటా గౌడ్, మణిరామ్, రావుల వెంకటేష్, జగన్ లాల్ నరసింహారావు, మల్లికార్జున్, మనోహర్రావు, తిరుపతి రెడ్డి, తంగేళ్లపల్లికి కృష్ణమూర్తి, బాల పోచయ్య, దేవరాజ్, రాజశేఖర్, వివిధ సంఘాల నాయకులు,   చల్లా లక్ష్మణ్, వారాల నరసింహులు,పాండు, రాజశేఖర్, రామచంద్రం, కిషన్, రాఘవేంద్ర, బాలకిషన్, రమ, ,  సిద్ధిరాములు, యాదగిరి, రామకృష్ణ, శ్రీనివాస్, సరస్వతి, రాధా, రమ, రమాదేవి, , తదితరులు పాల్గొన్నారు.

లెప్రసీ రహిత సమాజం కోసం సమష్టి కృషి
శివంపేట, (మెదక్): శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లెప్రసీ వ్యాధికి సంబంధించిన శాంపిల్ సర్వే, కేసుల రికార్డులు, నివేదికల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. లెప్రసీ శాంపిల్ సర్వే అధికారి డాక్టర్ సంపత్, ఉప జిల్లా వైద్యాధికారి డాక్టర్ సృజన, వారి కార్యాలయ సిబ్బంది, స్థానిక వైద్యాధికారి డాక్టర్ సాయి సౌమ్య, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వెంకటేశ్వరచారి, శ్రీనివాస్, సంతోష్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ పరిధిలో నమోదైన లెప్రసీ కేసులకు సంబంధించిన రికార్డులు, నివేదికలను అధికారులు పరిశీలించారు. అనంతరం వైద్య, ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించి లెప్రసీ వ్యాధి గుర్తింపు, వ్యాధిగ్రస్తులకు అందించాల్సిన చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. లెప్రసీ కేసులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించాలని అధికారులు సూచించారు. లెప్రసీ రహిత సమాజ నిర్మాణానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది ధనాగౌడ్, రాజయ్య, అనిత, శ్రీనివాస్, ఇందిరా, దేవరాజ్‌తో పాటు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్న చేగుంట అతిథిగృహం
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఎన్హెచ్44 ప్రక్కన మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి శాంక్షన్ చేసింది నిర్మించిన అతిథి గృహం ఈరోజు బోసిపోయి విలాసాలకు అడ్డగా మారుతూ వస్తుంది చుట్టుపక్కల చెట్లు పేరుకుపోయి గడ్డితో వెలసిల్లుతూ ఎవరైనా గెస్ట్ గా వస్తే ఎక్కువసేపు ఉండలేని స్థితిలో అతిథిగృహం ఆహ్వానం పలుకుతుంది  ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ లు పెడుతూ ఎప్పుడు బిజీగా ఉండాల్సిన అతిథిగృహం ఇప్పుడు చూడడానికి అధ్వానంగా ఉంటూ చూపే బంగారంగా మారుతూ వస్తుంది ఇక్కడైనా అధికారులు పట్టించుకోని అతిథిగృహాన్ని క్లీన్ చేసి వచ్చి పోయే వారికి అన్ని వసులు కలిగే విధంగా చూడాలని కోరుతున్నామని తెలిపారు

గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి - ఎస్సై నర్సింలు
చిలిపిచేడ్ (మెదక్ ): మండలంలోని అన్ని గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తెలంగాణ పోలీస్ అధికార పోస్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై నర్సింలు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్లో మండలంలో వివిధ గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే యువత తో మాట్లాడుతూ గణేష్ మండపం ఎక్కడ పెడతారో వాటి పూర్తి వివరాలు,ఊరేగింపు రూట్, నిమజ్జనం చేసే స్థలాన్ని ఆన్లైన్  దరఖాస్తులో వివరాలు నింపాలని అన్నారు. విద్యుత్ కొరకు విద్యుత్ శాఖ అధికారులచే పర్మిషన్ పొందాలని అన్నారు. ప్రతి గణేష్ మండపం వద్ద తప్పనిసరిగా ఇద్దరు వ్యక్తులు 24 గంటలు ఉండాలని అన్నారు.మండప నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటిస్తూ, సకాలంలో ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసి,శాంతి భద్రతలకు విఘతం కలగకుండా భక్తి శ్రద్దలతో శాంతి యుతంగా పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యుత్ రాకేష్ వివిధ గ్రామాల గణేష్ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.