Adilabad - Vision Andhra

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
ఆదిలాబాద్ జిల్లా :జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న నోటీసుల డెలివరీ, హియరింగ్‌లు, దరఖాస్తులు, ఫారాల డిస్పోజల్‌లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని స్పష్టం చేశారు.శనివారం తహసీల్దార్లు, సహాయ ఓటరు నమోదు అధికారులు (AERO), సంబంధిత అధికారులతో కలెక్టర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా SIR ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల పరిధిలో మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న నోటీసుల డెలివరీ, హియరింగ్‌లు, దరఖాస్తుల పరిష్కారం, ఫారాల డిస్పోజల్‌ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ అర్బన్‌ మండలంలో ఏఈఆర్వో పరిధిలో సుమారు 26 వేల నోటీసులు డెలివరీకి పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు సుమారు 600 హియరింగ్‌లు మాత్రమే పూర్తికావడంపై కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌ నోటీసుల డెలివరీతో పాటు హియరింగ్‌లు, దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. బోథ్‌ మండలంతో పాటు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లోనూ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.SIR ప్రక్రియకు నవంబర్‌ 5వ తేదీ తుది గడువు ఉన్నందున, అందుబాటులో ఉన్న పనిదినాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు ప్రతి రోజూ కనీసం 900 నోటీసులు, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసేలా మండలాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. రోజువారీ పురోగతిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పెండింగ్‌లో ఉన్న నోటీసులను సంబంధిత ఓటర్లకు వంద శాతం అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. నోటీసుల డెలివరీ అనంతరం హియరింగ్‌లను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, సంబంధిత ఫారాలను వెంటనే డిస్పోజ్‌ చేయాలని సూచించారు.ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఫస్ట్‌ డాక్యుమెంట్‌, సపోర్టింగ్‌ డాక్యుమెంట్లతో పాటు 1987కు ముందు, 2002కు ముందు, 2004 తర్వాత కాలానికి సంబంధించిన పత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అవసరమైన పత్రాలను నిబంధనల మేరకు రిటర్నింగ్‌ అధికారికి పంపాలని, పత్రాల పరిశీలనలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం-6, తొలగింపులు, అభ్యంతరాలకు సంబంధించిన ఫారం-7, సవరణలకు సంబంధించిన ఫారం-8 దరఖాస్తులు క్షేత్రస్థాయి నుంచి సంబంధిత కార్యాలయాలకు సకాలంలో చేరేలా బీఎల్‌వోలు, ఏఈఆర్వోలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిబంధనల ప్రకారం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు.ఓటర్ల జాబితా రూపకల్పన అత్యంత కీలకమైన ప్రక్రియ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హులైన పేర్లను నిబంధనల ప్రకారం తొలగించేలా పారదర్శకంగా చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా, నిర్దేశిత లక్ష్యాలను ప్రతిరోజూ సాధిస్తూ SIR ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ జూమ్ సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఆర్డీవో జగదీశ్వర్‌ రావు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తాం... కామ్రేడ్ విలాస్
ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రూరల్ మండలంభీంసారి గ్రామంలో ఘనంగా 78వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసారి గ్రామంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చిల్కా దేవిదాస్ ఆధ్వర్యంలో 78వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ఎస్. విలాస్, సీపీఐ ఆదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ సిర్ర దేవేందర్, సీపీఐ ఆదిలాబాద్ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ కట్ట చంద్రమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా భీంసారి గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, కామ్రేడ్స్ పండరినాథ్, రామయ్య, పార్ల విట్టల్, పూర్ణచందర్ స్మారక స్థూపాల వద్ద నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కామ్రేడ్ ఎస్. విలాస్, కామ్రేడ్ చిల్కా దేవిదాస్, కామ్రేడ్ కట్ట చంద్రమౌళి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం జరిగిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన వీరోచిత పోరాటంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం వేలాది మంది రైతులు, కూలీలు, పేద ప్రజలను ఏకం చేసి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గొప్ప ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని అన్నారు. ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టులు, రైతులు, కూలీలు, మహిళలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. “దున్నేవాడికే భూమి” అనే నినాదంతో సాగిన పోరాటం ఫలితంగా లక్షలాది ఎకరాల భూమి పేద ప్రజల చేతుల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.తెలంగాణ సాయుధ పోరాటం దేశ చరిత్రలోనే ఒక గొప్ప రైతాంగ పోరాటంగా నిలిచిందని అన్నారు. ఆ పోరాట స్ఫూర్తితోనే నేటికీ సీపీఐ పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తున్నాయని వారు విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ, పేదల సమస్యలను గాలికి వదిలేసి సంపన్నుల ఆస్తులు పెంచేందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు.పేదలకు ఇళ్ల స్థలాలు, గృహాలు, ఉపాధి, విద్య, వైద్యం, రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి మౌలిక సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన పోరాట కార్యక్రమాలు నిర్వహించడానికి వెనుకాడబోమని ప్రభుత్వాలను హెచ్చరించారు.తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరం విద్యార్థులు, యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కామ్రేడ్ ఎస్. విలాస్ అన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సీపీఐని బలోపేతం చేసి ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు కామ్రేడ్ గాజంగుల రాజు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ బత్తుల గంగారెడ్డి, సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్స్ బత్తుల రాజన్న, రామ్ రెడ్డి, సిసిలే దయానంద్, లక్ష్మి, యశోద, తుల్సి నర్సింగ్, చందా కిష్టయ్య, గంగారాం, గుండ్ల శ్రీను, ఖాళ్ళ నర్సింగ్, చంటి, మల్లేష్ తదితరులు, సీపీఐ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బంగారు, వెండి ఆభరణాల చోరీ – నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్  : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని మహంకాళి గల్లీలో ఓ ఇంట్లో తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిని గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఎల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 9న బాధితురాలు దుర్వ రాధ తన భర్తతో కలిసి కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సమయం లో ఇంటి తాళం, లోపల ఉన్న స్టీల్ బాక్స్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బాక్స్‌లో ఉన్న సుమారు రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి రెండు పగిలిన తాళాలను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ బ్యూరో సహకారంతో స్టీల్ బాక్స్ తదితర వస్తువులపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. సంఘటనా స్థలానికి సంబంధించిన  దర్యాప్తు కొనసాగించారు. నిందితున్ని శుక్రవారం అరెస్ట్ చేయడం జరిగింది అని తెలిపారు. దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తిపై  సైతం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అరెస్ట్ చేసిన నిందితుడు:
A1) పెండూర్ మధుకర్ (21) s/o కిషన్, డ్రైవర్, గిర్జై గ్రామం, బజార్‌హత్నూర్ మండలం, ప్రస్తుతం గుడిహత్నూర్.( దొంగ) A2) దహలే సంతోష్ (46) s/o నారాయణ, గోల్డ్‌స్మిత్, లింగాపూర్ రోడ్, గుడిహత్నూర్, (దొంగ వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తి) దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు క్షేత్రస్థాయిలో పలు కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితుడి కదలికలను గుర్తించి, చోరీ చేసిన ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసులో చోరీకి గురైన మొత్తం ఆభరణాలను 100 శాతం రికవరీ చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టారు. దొంగతనం చేసిన వస్తువులు అని తెలిసి కూడా వాటిని కొనుగోలు చేయడం లేదా విక్రయించేందుకు సహకరించడం చట్టపరంగా నేరమని, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎల్. శ్రీకాంత్ హెచ్చరించారు. ప్రజలు తమ ఇళ్లకు నాణ్యమైన తాళాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, ఎక్కువ సమయం ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే సమీప  పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

రహదారిపై బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్రాన్స్‌జెండర్ అరెస్ట్
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జామ్దాపూర్ ‘X’ రోడ్డు వద్ద వాహనాలను అడ్డగిస్తూ ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ V. విష్ణువర్ధన్ మరియు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న మెహెక్ ఖాన్ @ సోను (26) s/o ఆరిఫ్ ఖాన్, భుక్తాపూర్, ఆదిలాబాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజా రహదారులపై వాహనాలను అడ్డగించి బలవంతంగా డబ్బులు డిమాండ్ చేసే వారిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బలవంతంగా డబ్బులు వసూలు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి గా అచ్యుత్ రెడ్డి
ఆదిలాబాద్ డెస్క్, : బోథ్ మండల అధికార ప్రతినిధి గా ఆలపాటి అచ్యుత్ రెడ్డి నియమించారు ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ జాదవ్ విడుదల చేసిన మండల కమిటీ లో బోథ్ అధికార ప్రతినిధి గా అచ్యుత్ రెడ్డి నియామకం జరిగింది అని తెలిపారు ఈ సందర్భంగా అచ్యుత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో సముచిత స్థానం కలిపించిన జిల్లా మరియు మండల కమిటీ సభ్యులు కి ధన్యవాదాలు తెలిపారు నా పైన నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకి  నా వంతు కాంగ్రెస్ బలోపేతం కి కృషి చేస్తా అని మరియు ప్రతిపక్షం యొక్క అభాండాలు ని తిప్పి కొడతా అని మరియు మండల మరియు గ్రామ కమిటీ సభ్యులు తో కలిసి కాంగ్రెస్ పార్టీ బలపడటం కి కృషి చేస్తా అని తెలిపారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కి తగిన పదవి వచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు

అఖండ జ్యోతి వెలుగుల్లో కన్గుట్ట భక్తి పారవశ్యం
ఆదిలాబాద్ డెస్క్, :సజీవ వర్ణనగత ముప్పై రోజులుగా కన్గుట్ట గ్రామం ఒక పల్లెటూరులా లేదు అది ఒక తపోవనంలా మారిపోయింది. శ్రావణ మాసపు చల్లని గాలులు, తెల్లవారుజామున కురిసే పంచు బిందువుల మధ్య... ఆలయం నుండి వినిపించే 'శబరి మాత' నామస్మరణలు భక్తుల గుండెల్లో ఒక అలౌకిక ఆనందాన్ని నింపాయి.కళ్ళకు కట్టినట్టు భక్తి దృశ్యాలు పసిపిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకు అందరి ముఖాల్లోనూ ఒకటే తేజస్సు. చేతిలో పూలదండలు, కళ్లల్లో భక్తి ప్రపత్తులతో నిండిన నీటి సుడులు, పెదవులపై అమ్మవారి నామస్మరణ... ప్రతి భక్తునిలోనూ శబరి మాతకు శరణాగతి వేడిన భక్తిభావం స్పష్టంగా కనిపించింది. ప్రతిరోజూ అఖండ జ్యోతిని దర్శించుకునే సమయంలో భక్తులు పొందిన ఆనందం మాటలకు అతీతమైనది. తమ కష్టాలను, కన్నీళ్లను ఆ తల్లి పాదాల చెంత పెట్టి, జ్యోతి స్వరూపంలో ఉన్న అమ్మవారిని చూస్తూ మైమరచిపోయిన క్షణాలు ఆ గ్రామస్తుల జీవితాల్లో మరువలేనివి.ముగింపు వేళ ఉప్పొంగిన భావోద్వేగాలు:నేడు అఖండ జ్యోతి ముగింపు సమయం ఆసన్నమయేసరికి, భక్తుల హృదయాలు ఒక్కసారిగా బరువెక్కాయి. నెలరోజుల పాటు తమ ఇంట్లోనే ఉంటూ, తమను నడిపించిన తల్లి దూరం అవుతుందనే భావన వారి కళ్లల్లో కన్నీరుగా మారింది. అది బాధతో వచ్చిన కన్నీరు కాదు... ఆ తల్లి పట్ల ఉన్న అపారమైన అనురాగం, భక్తితో ఉప్పొంగిన ఆనంద భాష్పాలు.మంగళ హారతులు ఇస్తున్నప్పుడు, మంత్రోచ్ఛారణలు మిన్నంటుతున్నప్పుడు... భక్తులంతా ఒక్కటై చేతులు జోడించి "అమ్మా శబరి మాతా... మమ్మల్ని చల్లగా చూడమ్మా" అంటూ వేడుకున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. జ్యోతి రూపంలో ఉన్న అమ్మవారి వెలుగులు తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయనే నమ్మకంతో, ఆ దివ్య యజ్ఞానికి భక్తులు భక్తిశ్రద్ధలతో, కరతాళ ధ్వనుల మధ్య, భావోద్వేగాల కలయికతో అఖండంగా ముగింపు పలికారు

స్వచ్ఛమైన గానుగ నూనె ఆరోగ్యానికి మేలు: కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్ జిల్లా : రసాయనాలు లేకుండా పురాతన పద్ధతిలో ఎద్దుల గానుగ ద్వారా తీసే స్వచ్ఛమైన నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో తోట రాణి - శ్రీధర్ దంపతులు ఏర్పాటు చేసిన 'నిధి నేచురల్ ఫార్మింగ్' ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోనే తొలిసారిగా సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నూనె ఉత్పత్తిని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రజారోగ్యానికి దోహదపడే ఇలాంటి సహజసిద్ధ యూనిట్లకు ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, సబ్సిడీతో కూడిన రుణాలు సైతం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, తహసిల్దార్ రాజ్ మోహన్, ఎంపిడిఓ శంకర్, ఇతర అధికారులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.
ఆదిలాబాద్ జిల్లా : అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ డివిజన్ ఎఫ్‌డీఓ ప్రతమేష్ కేశవ్ తిజారే అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆదిలాబాద్‌లోని మావల పార్కులో ఉన్న అటవీ అమరవీరుల స్తూపం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఎఫ్‌డీఓ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెండు అటవీ డివిజన్లకు చెందిన రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, ఫీల్డ్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలోని దస్నాపూర్ బీట్‌లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌బీఓ గౌస్ మొయినుద్దీన్, ఇచ్చోడ రేంజ్‌లో విధి నిర్వహణలో ఉండగా ముల్తానీలో దారుణ హత్యకు గురైన మాంత్యా నాయక్ త్యాగాలను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఎఫ్‌డీఓ పేర్కొన్నారు. అమరవీరుల ధైర్యం, అంకితభావం, విధి నిర్వహణ పట్ల నిబద్ధత ప్రస్తుత అటవీ సిబ్బందికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
ఆదిలాబాద్‌ జిల్లాలో కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న 60 రోజుల ప్రత్యేక ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక శిక్షణలో మొత్తం 200 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 100 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు, 100 మంది ఎస్‌ఐ అభ్యర్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 13వ తేదీ వరకు ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. అభ్యర్థుల ఎంపికను నిర్దేశిత రిజర్వేషన్‌ ప్రకారం చేపట్టనున్నట్లు తెలిపారు.

- బీసీలు – 25 శాతం
- ఎస్సీలు – 25 శాతం
- ఎస్టీలు – 25 శాతం
- ఈబీసీ/ఈడబ్ల్యూఎస్‌/అనాథలు – 25 శాతం

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయానికి సంబంధించిన ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రం, రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పోలీస్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు తెలిపే పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

దరఖాస్తుల చివరి తేదీ: సెప్టెంబర్‌ 13, 2026
- మెరిట్‌ జాబితా: సెప్టెంబర్‌ 16, 2026
- సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబర్‌ 17 నుంచి 18 వరకు
- శిక్షణ ప్రారంభం: సెప్టెంబర్‌ 19, 2026

60 రోజుల శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ఉచితంగా పుస్తకాలు అందించడంతో పాటు, ప్రతిరోజూ నిపుణులైన అధ్యాపకులతో నాలుగు తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అభ్యర్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రతి వారం పూర్తి స్థాయి పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. మరిన్ని వివరాలకు:  ఫోన్‌: 08732-221280, 9949684959, 9494149416 బీసీ స్టడీ సర్కిల్‌, ఎస్సీ స్టడీ సర్కిల్‌, ఆదిలాబాద్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ  జయంతి నీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. రిమ్స్ ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,  టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తదితర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్,అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కిజార్ పాషా, జిల్లా పబ్లిసిటీ కోఆర్డినేటర్ మేకల జితేందర్, డీసీసీ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, డీసీసీ కార్యదర్శి హిమ అభిషేక్,తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ  జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం, చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆమె చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

పారిశ్రామిక పార్కు భూసేకరణపై అపోహలు వద్దు
ఆదిలాబాద్ డెస్క్,: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని రాంపూర్ (టీ), గిమ్మ (బీ), గూడ, హత్తిఘాట్ గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చేపడుతున్న నాలుగు గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మొత్తం 2,062.01 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఎం/ఎస్ జి.ఎస్. బయోటెక్ సంస్థకు చెందిన కొన్ని భూములను రుణ బకాయిల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిందన్నారు అయితే, ఈడీ అటాచ్ చేసిన 500 ఎకరాలకు పైగా భూమిని సేకరిస్తున్నట్లు కథనంలో పేర్కొనడం వాస్తవం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్‌సీఎల్‌టీ లిక్విడేటర్ అందించిన జాబితా ప్రకారం, ఈడీ అటాచ్ చేసిన భూముల్లో కేవలం 47.22 ఎకరాలు మాత్రమే ప్రస్తుత భూసేకరణ ప్రతిపాదనల్లో ఉన్నాయని తెలిపారు గ్రామాల వారీగా భూముల వివరాలు గూడ: 259.23 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 37.23 ఎకరాలు.రాంపూర్ (టీ): 333.38 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 9.39 ఎకరాలు,గిమ్మ (బీ): 274.09 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి లేదు మరియు హత్తిఘాట్: 1,149.11 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి లేదు మొత్తంగా 2,062.01 ఎకరాల భూమి సేకరణకు ప్రతిపాదించగా, అందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 47.22 ఎకరాలు మాత్రమేనని, భూములను సేకరిస్తున్నారంటూ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండా ఇలాంటి కథనాలు ప్రచురించడం వల్ల భూ యజమానులు, ప్రజల్లో అనవసరమైన అపోహలు, ఆందోళనలు ఏర్పడే అవకాశం ఉందన్నారు భూసేకరణ ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. భూమికి సంబంధించి ఏదైనా టైటిల్ వివాదం ఉన్నట్లయితే RFCTLARR చట్టం–2013, తెలంగాణ సవరణ చట్టం–2016 నిబంధనల ప్రకారం తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించిన వాస్తవాలను ప్రజలు గమనించాలని, అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.

నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ లు చేసుకున్న ఎంతటి వారైనా వదలం.: డీఎస్పీ జీవన్ రెడ్డి
ఆదిలాబాద్ :ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్-టి గ్రామంలో నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా వారసత్వ వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు మహమ్మద్ ఇబ్రహీం అక్బానీ @ మామ్లా సేఠ్‌ను ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారించగా, నకిలీ పత్రాల తయారీలో డాక్యుమెంట్ రైటర్ మహమ్మద్ పైజుద్దీన్ సిద్ధిఖీ @ సాహెర్ పాత్రపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా డాక్యుమెంట్ రైటర్ మహమ్మద్ పైజుద్దీన్ సిద్ధిఖీ @ సాహెర్‌ను బుధవారం అరెస్ట్ చేసి, గురువారం న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు. నకిలీ వారసత్వ ధృవీకరణ పత్రాలు, ఇతర పత్రాలను సృష్టించడంలో అతని పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వివరించారు.
భూమి యజమాని సయ్యద్ సఫ్దర్ అలీ ఈ సంవత్సరం భూమికి సంబంధించిన వాల్యుయేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయగా, తన పేరుపై ఉన్న భూమి ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిఎస్పి తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మహేష్ కుమార్ ఖేతాన్ విచారించగా, మహమ్మద్ ఇబ్రహీం అక్బానీ @ మామ్లా సేఠ్, సూరజ్ సేఠ్ మధ్యవర్తులుగా వ్యవహరించి, నకిలీ పత్రాలు సృష్టించి భూమిపై అక్రమ హక్కులు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.నకిలీ పత్రాల తయారీకి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు ముందు సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందికి సూచించారు.
ప్రజలు భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే ముందు యాజమాన్య హక్కులు, వారసత్వ పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు మరియు సంబంధిత రికార్డులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.ల్యాండ్ గ్రాబర్స్ ఎంతటి వారైనా, ఎన్ని సంవత్సరాల క్రితం నకిలీ పత్రాలు సృష్టించినా చట్టపరమైన చర్యలు తప్పవని డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ పత్రాల ద్వారా భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉట్ల గణపతికి వారసత్వ సర్టిఫికెట్ మంజూరు చేసిన రెవెన్యూ సిబ్బంది పాత్ర పై సైతం విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణం మరియు జిల్లాలో బడా రియల్టర్ల మోసాలకు గురైన బాధితులు భయపడకుండా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని డిఎస్పి సూచించారు. బాధితులకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ చట్ట ప్రకారం న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.