Suryapet - Vision Andhra

రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్..
సూర్యాపేట : వినాయక చవితి పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు, సమస్యాత్మక వ్యక్తులకు ముందస్తు కౌన్సిలింగ్ నిర్వహించారు.పండుగ వేడుకల సందర్భంగా ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ వెంకటయ్య హెచ్చరించారు. వినాయక మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి గొడవలు, వివాదాలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.పట్టణంలో పాత నేర చరిత్ర కలిగిన, రౌడీ షీటర్లుగా నమోదైన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న సుమారు 30 మందికి పైగా వ్యక్తులపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు లేదా గొడవలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ వెంకటయ్య కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు అజయ్, సందీప్ రెడ్డి, కనకరత్నం, పోలీసు సిబ్బంది శ్రీరాములు, రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌ మండల ఎస్‌జీఎఫ్‌ క్రీడల విజేతలు వీరే
పెన్‌పహాడ్,(సూర్యాపేట ):  మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ అనంతారం పాఠశాల వేదికగా రెండు రోజుల పాటు సాగిన పెన్‌పహాడ్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల అభివృద్ధి అధికారి ఏ. జానయ్య గెలుపొందిన క్రీడాకారులకు బహుమ తులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో రాణించి డివిజన్, జిల్లా స్థాయిలో మండలానికి మంచి పేరు తేవాలన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఎంఈఓ ఎన్. రవి, ఆతిథ్యమిచ్చిన హెచ్‌ఎం ఎర్రంశెట్టి రవీంద్రబాబు, వ్యాయామ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. అనంతరం ప్రతిభావంతులైన క్రీడాకారుల ను ఉన్నత స్థాయి జట్లకు ఎంపిక చేశారు.రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగిన  పోటీల ఫలితాలు ఇలా ఉన్నాయి. అండర్-14 బాలికల కబడ్డీలో అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి సాధించగా, దోసపహాడ్ గురుకులం రెండవ బహుమతి గెలుచుకుంది. ఖో-ఖోలో అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, దోసపహాడ్ గురుకులం రెండవ బహుమతి సాధించాయి. వాలీబాల్‌లో జీ.మల్కాపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, పెన్‌పహాడ్ కేజీబీవీ రెండవ బహుమతి కైవసం చేసుకున్నాయి. అండర్-17 బాలికల కబడ్డీలో దోసపహాడ్ గురుకులం మొదటి బహుమతి, పెన్‌పహాడ్ కేజీబీవీ రెండవ బహుమతి సాధించాయి. ఖో-ఖోలో దోసపహాడ్ గురుకులం మొదటి బహుమతి, అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి పొందాయి. వాలీబాల్‌లో జీ.మల్కాపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి సాధించాయి.అండర్-14 బాలుర కబడ్డీలో అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి గెలిచాయి. ఖో-ఖోలో అనంతారం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, అనాజిపురం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి సాధించాయి. వాలీబాల్‌లో పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి, జీ.మల్కాపురం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి పొందాయి. అండర్-17 బాలుర కబడ్డీలో అనాజిపురం టీజీఎమ్ఎస్ మొదటి బహుమతి, అనంతారం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి సాధించాయి. ఖో-ఖోలో అనాజిపురం టీజీఎమ్ఎస్ మొదటి బహుమతి, అనంతారం జెడ్పీహెచ్ఎస్ రెండవ బహుమతి కైవసం చేసుకున్నాయి. వాలీబాల్‌లో జీ.మల్కాపురం జెడ్పీహెచ్ఎస్ మొదటి బహుమతి సాధించగా, అనాజిపురం టీజీఎమ్ఎస్ రెండవ బహుమతితో సరిపెట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి శోభ, జిహెచ్ఎం అంజయ్య, పల్స వెంకన్న, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నీట్ విజేత ‘ఇందు’కు కొండంత అండ గా సూర్యాపేట ఎస్పి
పెన్ పహాడ్,(సూర్యాపేట): పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదని నిరూపించిన నిరుపేద విద్యార్థిని మామిడి ఇందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ కొండంత అండగా నిలిచారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన దివ్యాంగ కార్మికుడి కుమార్తె ఇందు, అంగవైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ గురుకులంలో చదివి జాతీయ స్థాయి నీట్ పరీక్షలో గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది.ఆమె ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్పీ, తక్షణమే స్పందించి తన కార్యాలయంలో రూ.20,000/- నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇందు ప్రతిభ సమాజానికే గర్వకారణమని, భవిష్యత్తు చదువులో ఎలాంటి సమస్య ఎదురైనా పోలీస్ శాఖ తరపున ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని కొండంత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు.

గణేష్ మండపాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
పెన్ పహాడ్, (సూర్యాపేట ): మండల పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పెన్ పహాడ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ఎన్. బాలు నాయక్ స్పష్టం చేశారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను మండలంలో ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వారు అందించిన అధికారిక లింక్ ద్వారా తమ మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, దానికి సంబంధించిన ఇంటిమేషన్ లెటర్‌ను తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందజేసి అనుమతి పొందాలన్నారు.ఉత్సవాల నిర్వహణలో భాగంగా మైక్ సెట్ల అనుమతి, విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని, రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వాహకులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తీసుకునే భద్రతా చర్యలకు ఉత్సవ కమిటీ సభ్యులు, యువత పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్ఐ బాలు నాయక్ పిలుపునిచ్చారు.

తుంగతుర్తిలో వీరనారి చాకలి అవిలమ్మకు ఘన నివాళి
తుంగతుర్తి :  తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి చిట్యాల అవిలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తుంగతుర్తి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. దొరల పెత్తనం, దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి అవిలమ్మ త్యాగాలు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.ఇసునూరు దేశ్‌ముఖ్‌ ఆగడాలను ఎదిరిస్తూ, తన పంట పొలంలో పండిన పంటను అక్రమంగా దోచుకునేందుకు వచ్చిన గుండాలను ఎదుర్కొని పోరాడిన ధీరవనిత చాకలి అవిలమ్మ అని కొనియాడారు.ఆమె చూపిన ధైర్యం, తెగువ, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్‌, పట్టణ అధ్యక్షులు గొప్పగాని శ్రీనివాస్‌, గోపగాని వెంకన్న, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, మల్లేపాక రాములు, గడ్డం సోమేష్‌, పాలడుగు జాలంధర్‌, తాళ్లపెల్లి యాకయ్య, బొజ్జ సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలకు దాతల మహోన్నత సాయం
పెన్‌పహాడ్ ( సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని మండల విద్యాధికారి నకిరేకంటి రవి అన్నారు. సింగారెడ్డిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు దాతల ఆర్థిక సహాయంతో సమకూరిన డిజిటల్ ప్రొజెక్టర్, స్పోర్ట్స్ డ్రెస్సులను ఆయన విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాల డిజిటల్ విద్య కోసం దాత రిటైర్డ్ టీచర్  బొల్లెద్దు నరేందర్ ₹13,000 విలువైన ప్రొజెక్టర్‌ను బహుకరించగా, విద్యార్థుల కోసం దాతలు రౌత్ ఉపేందర్ రావు (₹9,000), వార్డు మెంబర్ పేర్ల గణేశ్ (₹5,500) ఉదారంగా స్పోర్ట్స్ డ్రెస్సులను సమకూర్చారు.ఈ సందర్భంగా ఎంఈఓ రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు దాతల సహకారం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు . రవీందర్ బాబు, గ్రామ సర్పంచ్ ఒగ్గు కిరణ్, పంచాయతీ సెక్రటరీ షేక్. అఖిల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్ల శ్రీనివాసులు, ఉపాధ్యాయులు . సరిత, శిగ మహేశ్, దాతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

భూ వివాదాల పరిష్కారానికే రీ సర్వే
పెన్ పహాడ్,(సూర్యాపేట): భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూమి రీ సర్వే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆర్డీవో వేణుమాధవరావు తెలిపారు. మండల పరిధిలోని రాజపేట గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న నేపథ్యంలో బుధవారం అనాజిపురం గ్రామంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసిల్దార్ గుమ్మి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ఆర్డీవోతో పాటు సూర్యాపేట వ్యవసాయ శాఖ ఏడి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్డీవో వేణు మాధవరావు మాట్లాడుతూ... పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన రాజపేట గ్రామంలో రీ సర్వేను వంద శాతం విజయవంతం చేసేందుకు రైతులంతా క్షేత్రస్థాయిలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ సర్పంచ్ అనుము లపూరి నాగయ్య మాట్లాడుతూ... రైతులెవరూ ఎలాంటి అపోహలకు లోనుకాకుండా సర్వేలో పాల్గొని తమ భూములకు సంబంధిం చిన సరైన వివరాలను అధికారులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అజీజ్ ఉన్నిసా, రంజిత్ రెడ్డి, జీపీఓలు, ఏఈఓ మురళి మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

దోసపహాడ్ వీధి దీపాల వివరాలపై 'సమాచార' ఆరా!
పెన్ పహాడ్,( సూర్యాపేట): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామంలో గత కొంతకాలంగా చేపట్టిన వీధి దీపాల ఏర్పాటు, వాటి ఖర్చులకు సంబంధించిన వివరాలను కోరుతూ బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి  కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు నమోదైంది.గ్రామానికి చెందిన సద్దల నాగేశ్వర్ అనే దరఖాస్తుదారుడు ఈ అర్జీని సమర్పించారు. గ్రామంలో ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్) బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు వీధి స్తంభాలకు ఏర్పాటు చేసిన కొత్త ఎల్‌ఈడీ బల్బులు, ఫ్రేముల వివరాలను వీధుల వారీగా తెలియజేయాలని ఆయన కోరారు.అదేవిధంగా, ఈ కొనుగోళ్లకు సంబంధించిన అంచనాలు, టెండర్లు, బిల్లులు, వోచర్ల కాపీలతో పాటు, ఏ నిధుల నుండి ఈ ఖర్చులు చేశారనే సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందించాలని దరఖాస్తులో పేర్కొన్నారు. తాను దారిద్ర్య రేఖకు దిగువన  ఉన్నందున, చట్టంలోని సెక్షన్ 7(5) ప్రకారం ఫీజు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తన తెల్ల రేషన్ కార్డు ప్రతిని దరఖాస్తుకు జతపరిచినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండేటి బిక్షం రెడ్డి, మల్లేపల్లి వెంకటేశ్వర్లు  తదితరులు పాల్గొన్నారు.

బడిపిల్లల కష్టాలు తీర్చిన సర్పంచ్ 'సైకిల్' బాసట
పెన్ పహాడ్, ( సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ స్థానిక సర్పంచ్ నాతాల వెంకట్‌రెడ్డి అరుదైన ఉదారతను చాటుకున్నారు. మండల పరిధిలోని గాజుల మల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పాఠశాలలో చదవడానికి ప్రతిరోజూ సుమారు 7 కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న నలుగురు పేద విద్యార్థులను సర్పంచ్ గుర్తించారు. రవాణా కష్టాల వల్ల విద్యార్థులు బడికి దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఒక్కొక్కటి రూ. 6,000 చొప్పున మొత్తం రూ. 24,000 విలువైన నాలుగు సైకిళ్లను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి బహుమతిగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నాతాల వెంకటరెడ్డి మాట్లాడుతూ, దూర భారం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఈ చిన్న సహాయం చేశానని తెలిపారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా దూరం నుండి వచ్చే పేద విద్యార్థులను గుర్తించి, వారికి సొంత ఖర్చులతో సైకిళ్లను పంపిణీ చేస్తానని ఈ వేదికగా ఆయన సంచలన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు.హెచ్‌ఎం చేకూరి అంజయ్య మాట్లాడుతూ, విద్యార్థుల కష్టాన్ని గుర్తించి సకాలంలో స్పందించిన సర్పంచ్ చొరవ అందరికీ స్పూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి రామకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి లావణ్య, డాక్టర్ కవిత, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మంజుల, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీరాములు, విద్యార్థుల తల్లిదండ్రులు భూక్య వెంకటేశ్వర్లు, గుగులోతు సురేష్, వెంకన్న, నిర్మల, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
సూర్యాపేట :నూతన మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరి నెలలు గడుస్తున్నా సూర్యాపేట మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల నియామకం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీంతో కో ఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులు, ఆశావహులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.2026 ఫిబ్రవరిలో సూర్యాపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. 48 మంది వార్డు సభ్యులతో కౌన్సిల్ ఏర్పాటైంది. అయితే ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారిక కౌన్సిల్ జాబితాలో వార్డు సభ్యుల వివరాలే కనిపిస్తున్నాయి. కో-ఆప్షన్ సభ్యుల వివరాలు మాత్రం అందుబాటులో లేవు.కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు..? దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు..? ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారు.? అనే అంశాలపై స్పష్టత కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఇతర మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతున్న సందర్భంలో సూర్యాపేటలో మాత్రం ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు పూర్తయినట్లు తాజా వార్తలు వెలువడ్డాయి.కో ఆప్షన్ పదవుల కోసం అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజిక సేవ, స్థానిక రాజకీయ అనుభవం, పార్టీకి చేసిన సేవ తదితర అంశాల ఆధారంగా ఎంపిక జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే అధికారిక నోటిఫికేషన్ లేదా ఎన్నిక తేదీ వెలువడే వరకు వేచి చూడాల్సిందే..

అధికారుల ప్రకటన కోసం ఎదురుచూపులు

సూర్యాపేట మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియపై మున్సిపల్ అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు.? దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు..? ఎన్నిక ఎప్పుడు..? అనే మూడు అంశాలపై అధికారిక ప్రకటన వెలువడితే ఉత్కంఠకు తెరపడనుంది.

విద్యార్థుల చెంతకే బ్యాంకింగ్ సేవలు చేర్చిన చీదేళ్ల ఎస్‌బీఐ బ్రాంచ్
పెన్‌పహాడ్,( సూర్యాపేట): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీదేళ్ల బ్రాంచ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సీఎస్‌పీ నిర్వాహకులు పేరూరి వెంకటేశ్వర్లు నేతృత్వంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పాఠశాల విద్యార్థులకు అక్కడికక్కడే నూతన బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మేనేజర్ రవీందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా శాఖ అందించే స్కాలర్‌షిప్ (విద్యార్థి వేతనాలు) ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా విద్యార్థుల అకౌంట్లలో జమ కావడానికే ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎస్‌బీఐ అందిస్తున్న ఈ ఉచిత జీరో బ్యాలెన్స్ ఖాతాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక క్యాంప్ ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులు నూతన ఖాతాలను పొందారు.ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ వీరు, క్యాషియర్ నాగేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
సూర్యాపేట : సూర్యాపేట: పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. బొడ్రాయి బజార్ సమీపంలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస కిరాణా మర్చంట్స్ యజమాని చిల్లంచర్ల సోమేశ్వర్ తన షాపులో పనిచేస్తున్న ఉమతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆయన భార్య ఆరోపించింది.తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదని భార్య ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భర్త మరో మహిళ ఇంటికి వెళ్లాడని తెలుసుకున్న ఆమె గురువారం రాత్రి తీవ్ర ఆవేదనతో అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అక్కడ భర్తను ఉమతో ఒకే గదిలో చూసిన ఆమె.. తట్టుకోలేక కన్నీరుమున్నీరైనట్లు స్థానికులు చెబుతున్నారు.ఆరు సంవత్సరాలుగా భర్తకు ఉమాతో వివాహేతర సంబంధం ఉందని, ఆమెను షాపులో యజమానిలా చూసుకుంటూ ఆరు సంవత్సరాలుగా డబ్బులు, సుమారు 20 తులాల బంగారం ఇచ్చాడని భార్య ఆరోపించింది. మరోవైపు తనను, ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి వెళ్లగొట్టి తమ జీవితాలను రోడ్డున పడేశాడని ఆమె వాపోయింది.“భర్తే దిక్కనుకున్న నాకు.. ఇద్దరు పిల్లలతో ఇప్పుడు ఎవరు దిక్కు..?” అంటూ ఆమె కన్నీరు మున్నీరైనట్లు స్థానికులు తెలిపారు. భర్తపై పెట్టుకున్న నమ్మకం కళ్లముందే కూలిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన ఆమె.. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కుటుంబ బాధ్యతలను విస్మరించి మరో మహిళ ఇంటికి వెళ్లడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రతి రోజు అతను ఆమె ఇంటికి రాత్రి పూట వచ్చేవాడని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని సోమేశ్వర్, ఉమను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది..