Bhadradri Kothagudem - Vision Andhra

కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ పోరుకు అసెంబ్లీ వేదికా?
కొత్తగూడెం : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను పక్కనబెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు, పక్కదారి రాజకీయాలకు పాల్పడుతున్నాయని జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాల్సిన చట్టసభలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని పేర్కొంటూ నిరసన తెలిపారు. జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి డా. గడల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు సెంటర్‌లో డా. బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 22-ఏలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అవినీతిని అరికట్టి పారదర్శక పాలన అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ వర్గపోరుకు అసెంబ్లీని అడ్డాగా మార్చొద్దని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టసభల్లో సమగ్రంగా చర్చ జరగాలని అన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రజా సమస్యలను పక్కనబెట్టి పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలయాపన చేయడం తగదన్నారు. తెలంగాణకు కావాల్సింది రాజకీయ నాటకాలు కాదు.. ప్రజాపాలన అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సాధిక్‌ పాషా, మోదుగు జోగారావు, పుదారి శ్యామ్‌, అంజి నాయుడు, రాము, సాంభ, సాయి, సంపత్‌, పాషా, రమేష్‌, బాలకృష్ణ, పులి, పండు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లపై ఎస్పీ ఆకస్మిక తనిఖీ
కొత్తగూడెం  : ప్రజలకు పోలీసుల భద్రతా సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా విజిబుల్ పోలీసింగ్‌పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ.. రాత్రి వేళల్లో పోలీసుల పనితీరు, గస్తీ విధానాలు, సిబ్బంది అందుబాటులో ఉండే పరిస్థితులను పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి సీసీ కెమెరాల ద్వారా కొనసాగుతున్న నిరంతర పర్యవేక్షణను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కదలికలు, ఘటనలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. అలర్టింగ్ అధికారులు, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రాత్రి వేళల్లో పోలీసుల నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
రాత్రి గస్తీపై ప్రత్యేక దృష్టి
రాత్రి సమయంలో పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ప్రధాన రహదారులతో పాటు జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ పోలీసుల విజిబిలిటీ పెంచాలని సూచించారు.
రౌడీషీటర్ల కదలికలపై నిఘా
సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
112 కాల్‌కు తక్షణ స్పందన
డయల్-112కు ఫోన్ వచ్చిన వెంటనే సంబంధిత సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు త్వరితగతిన సహాయం అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, రాత్రింబవళ్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేలా విజిబుల్ పోలీసింగ్‌ను మరింత విస్తృతం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశించారు.

ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం దారుణం
చర్ల,(భద్రాద్రి కొత్తగూడెం) : అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డు కోవడం, వారిపై దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ యువజన నాయకులు కాకి అనిల్, అంబోజి సతీష్ తీవ్రంగా ఖండించారు, సోమవారం జరిగిన ఈ ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న బీఆర్ఎస్ నేతలను అణచివేసే ప్రయత్నంలో భాగంగా, కనీసం మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా చీరలు లాగడం, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. కేటీఆర్, హరీష్‌రావుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అధికార పక్షం ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి, ఆ నేతను ఎదుర్కొనే దమ్ముందా అని సవాల్ విసిరారు. అసలు నైతికత లేని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, వార్డు సభ్యుడిగా కూడా గెలవని సీఎం సోదరుడికి నలుగురు గన్‌మెన్లను కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు, వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు, 420 హామీలు వెయ్యి రోజులు గడుస్తున్నా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన సాగిస్తున్న ప్రభుత్వ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని యువజన నాయకులు అంబోజు సతీష్,  కాకి అనిల్ లు హెచ్చరించారు.

రోడ్లపై పశువులను వదిలితే చర్యలు
కొత్తగూడెం : పట్టణంలోని జాతీయ రహదారులతో పాటు ప్రధాన రోడ్లపై ఆవులు, గేదెలను విచ్చలవిడిగా వదిలేస్తున్న పశువుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. రోడ్లపై పగలు, రాత్రి పశువులు సంచరించడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో పశువులు సైతం గాయపడుతున్నాయని అధికారులు తెలిపారు. పశువులను ఇంటి ఆవరణలో లేదా పొలం వద్ద కట్టివేసి పెంచుకోవాలని యజమానులకు ఇప్పటికే పలుమార్లు నోటీసుల ద్వారా సూచించినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఇకపై రోడ్లపై సంచరించే పశువులను గోశాలకు తరలించడంతో పాటు, వాటి యజమానులపై మున్సిపల్ చట్టం–2019, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలకు పశువుల యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు, వాహనదారుల భద్రత దృష్ట్యా పశువుల యజమానులు సహకరించాలని కోరారు.

యాదగిరిగుట్ట మండలంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
యాదగిరిగుట్ట: మండలవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి ప్రేమానురాగాలను చాటుకున్నారు. సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి, హారతులు ఇచ్చి రాఖీలు కట్టారు. అనంతరం మిఠాయిలు తినిపించి వారి క్షేమాన్ని ఆకాంక్షించారు.అన్నదమ్ములు సైతం అక్కాచెల్లెళ్లకు కానుకలు అందజేసి ఆప్యాయతను చాటుకున్నారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో రాఖీ పండుగ సందడి నెలకొంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ను కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
టేకులపల్లి. టేకులపల్లి మండలం వి.బి.జి.ఆర్.ఎం.జి. పథకంలో భాగంగా బోడు, లచ్చగూడెం గ్రామపంచాయతీల్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు  పొదేం స్వరూప,  ఎదుల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.బోడు గ్రామంలోని గుట్ట చెరువు వద్ద ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. లచ్చగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సుమారు 200 పూలు, పండ్ల మొక్కలను నాటించారు. కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాలయం అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎన్. రవికుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కొండపల్లి శ్రీదేవి హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవోలు, ఈసీలు, పీఎస్‌లు, టీఏలు, ఎఫ్‌ఏలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ, ఎస్‌ఐలు, అటవీ శాఖ ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు, పోలీస్ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వనమహోత్సవంలో మొక్కలు నాటిన మేయర్, కమిషనర్
కొత్తగూడెం  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం–2026లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్‌లోని రామచంద్ర పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత మొక్కలు నాటారు. పలువురు డివిజన్ కార్పొరేటర్లు సైతం పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “ప్రతి ఇంటా ఒక మొక్క.. ప్రతి ఊరు పచ్చని వనం” అనే లక్ష్యంతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు నాటిన మొక్కలే రేపటి తరాలకు జీవనాధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు.“మొక్కని నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆమె కోరారు.

చదువుతో పాటు నైపుణ్యం..
కొత్తగూడెం  : విద్యా సంవత్సరానికి ఎటిసి , ప్రభుత్వ ఐటీఐ, ఆర్ ఐ టి ఐ , మైనారిటీ ఐటీఐ, ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు మూడో దశ వాక్‌ఇన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెం ప్రిన్సిపాల్ జి. రమేశ్ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 5 సాయంత్రం 5 గంటల వరకు iti.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో రూ.100 ధ్రువీకరణ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం ట్రేడ్‌, ఐటీఐలకు సంబంధించిన ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు అనంతరం అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సంబంధిత ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 10 గంటలకు హాజరై అటెండీ తీసుకోవాలని, మధ్యాహ్నం 1 గంట నుంచి మెరిట్‌, ఎంపిక చేసుకున్న ట్రేడ్‌, ఐటీఐ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. 10వ తరగతి లేదా కొన్ని నిర్దిష్ట ట్రేడ్‌లకు 8వ తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2022 ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని, గరిష్ఠ వయోపరిమితి లేదని పేర్కొన్నారు. ఒకే ఆన్‌లైన్‌ దరఖాస్తులో అభ్యర్థులు తమకు నచ్చినన్ని ట్రేడ్‌లు, ఐటీఐలను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకోవచ్చని, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా సీటు పొందే అవకాశాలు మెరుగుపడతాయని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ జి. రమేశ్‌ కోరారు.

శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వ అల్పాహారం పంపిణీ
టేకులపల్లి: ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్ గ్రామపంచాయతీ పరిధిలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారాన్ని గ్రామ సర్పంచ్ బి. పూలబంతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బి. పూలబంతి స్వయంగా చిన్నారులకు అల్పాహారం అందించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని, వారి ఆరోగ్యం, ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ కమల, పాఠశాల ఆయా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న అల్పాహారం, ఇతర సౌకర్యాలను వారు పరిశీలించారు.

గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత
కొత్తగూడెం : రామవరం–కొత్తగూడెం ప్రధాన రహదారిలోని గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే నిర్మించిన బ్రిడ్జిపై వరుసగా గుంతలు ఏర్పడుతుండటంతో నిర్మాణ నాణ్యతపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బ్రిడ్జికి ఒక వైపున గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. తాజాగా మరో వైపున కూడా భారీ గుంత ఏర్పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ప్రధాన రహదారిపై గుంత ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ , టూ టౌన్ ఎస్‌ ఐ రాజశేఖర్ గుంత ఏర్పడిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వన్‌వే ట్రాఫిక్‌ను అమలు చేశారు. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగిస్తున్నారు. ఇటీవల నిర్మించిన బ్రిడ్జిపైనే తరచూ గుంతలు ఏర్పడుతుండటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి గుంతలు ఏర్పడకుండా నాణ్యమైన మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.

పేదల సంక్షేమ పథకాలను కొనసాగించాలి: బీఆర్ఎస్ నాయకులు
కొత్తగూడెం : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీదేవిపల్లి మండల తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పిలుపు మేరకు లక్ష్మీదేవిపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ఆర్థికంగా అండగా నిలిచాయని అన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం భారంగా మారకుండా ఈ పథకాలు ఎంతోమందికి సహాయపడ్డాయని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా అనేక కుటుంబాల ఇళ్లలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. ప్రజలకు ఉపయోగపడుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆలోచించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా కొనసాగించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, ఎదురుగడ్డ సురేష్, వినోద్, ఉపసర్పంచ్ శ్రీను, శ్రీకాంత్ నాయక్, రాజవరపు మురళి, తరాల దాము, తరాల మహేష్, శ్రీను, పొగాకు వెంకటేశ్వర్లు, శివ, లాలు తండా శ్రీను, ఉపసర్పంచ్ బట్టు రవి, మంగ్య, స్టేజి రమేష్, లావుడియా ప్రసాద్, పెద్దతండ రవి, శివ, చిన్న, నాగరాజు, చిన్ని, వంశీ, చిన్ను, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.

ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా భారతం: మేయర్ మూడ్ గణేష్
కొత్తగూడెం : కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లలో నగర మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. మొదట సుజాతనగర్, అనంతరం పాల్వంచ, చివరగా కొత్తగూడెం డివిజన్‌లో మేయర్ మూడ్ గణేష్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం చేసి, దేశ ప్రజలకు, నగర ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ.. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమేనని అన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని తెలిపారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే దేశ పురోగతి సహజంగానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తమ విధులను నిజాయితీగా నిర్వర్తించడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం అందించే నిజమైన గౌరవమని అన్నారు.

కార్పొరేషన్ అభివృద్ధికి సమన్వయంతో ముందుకు

కొత్తగూడెం కార్పొరేషన్ నూతనంగా ఏర్పడిన అనంతరం మొదటిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని మేయర్ తెలిపారు. నూతన కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. నగర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతామని మేయర్ స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రతి డివిజన్‌లోని సమస్యలను పరిష్కరించే దిశగా సమష్టిగా పనిచేయాలని సూచించారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటూ కొత్తగూడెం కార్పొరేషన్‌ను ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు దేశభక్తి వాతావరణంలో జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ సిబ్బంది, స్థానికులు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ విజయానంద్, కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.