Nirmal - Vision Andhra

సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్  : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సీఎం ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని, పైస్థాయిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులను వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలకు సంబంధించిన గోడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. డీడబ్ల్యూవో వినూత్నతో కలిసి గోడప్రతులను ఆవిష్కరించిన ఆయన, పోషణ మాసం కార్యక్రమాలను అక్టోబర్ 8వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోషకాహారం, ఆరోగ్యం, మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో కలెక్టర్ సమావేశమై ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. రోజువారీగా నమోదవుతున్న ఓపీ వివరాలతో పాటు వివిధ విభాగాల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, రేడియాలజీ, ఈఎన్‌టీ తదితర విభాగాల్లో వైద్య సేవల మెరుగుదలకు అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్సలకు అవసరమైన యంత్రాల వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి సేకరించారు. అవసరమైన పరికరాలను ప్రాధాన్యత క్రమంలో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సౌకర్యవంతంగా వైద్య సేవలు అందేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది రోగులకు ఆసుపత్రిలోనే మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పార్కింగ్ స్థలాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, అధికారులు రమేష్, సరోజ, వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం
నిర్మల్ జిల్లా : కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా అదనపు కలెక్టర్, అధికారులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఐలమ్మ పోరాటాలను గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను వివరించారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని లిఖించిందని తెలిపారు. వెట్టి చాకిరి నిర్మూలనకు పాటుపడిన గొప్ప మహిళ అని వివరించారు. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చాకలి ఐలమ్మ లాంటి వీర వనితల చరిత్రను నేటి తరం ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శంకర్, సిపిఓ గంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి:
నిర్మల్ :ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  బుధవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సీఈవో సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేరకు గుర్తించి తొలగించాలని సూచించారు.  బీఎల్‌ఓల వద్ద ఉన్న దరఖాస్తులు, ఓటర్ల జాబితాలను పరిశీలించిన సీఈఓ, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్లను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.  18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓలు  బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఈఓ సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రతి వివరాన్ని సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి దశలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎస్ఐఆర్ ప్రక్రియను సీఈవోకి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో నమోదు కాకుండా దూరమవ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, అనర్హుల పేర్లు కొనసాగకుండా నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, తహసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్  :  కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని  సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. చేశారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు గండ్రత్ రమేష్, సిరికొండ రమేష్, మజార్, ముజాహిద్ శ్రావణ్, అజార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో ఘనంగా కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు
నిర్మల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు బుధవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.  ఈ జయంతి వేడుకలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యేలా తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రచించి, ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సేవలకు కేంద్ర ప్రభుత్వం 1992 లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని చెప్పారు. ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కాళోజీ లాంటి గొప్ప వ్యక్తుల జయంతులను ఈ విధంగా అధికారికంగా నిర్వహించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇటువంటి మహనీయుల జయంతి ఉత్స వాల అధికారికంగా నిర్వహించడం ద్వారా భావితరాల వారికి వారి గొప్పతనాన్ని తెలియజెప్పిన వారిమవుతామని తెలిపారు.  ఈ జయంతి వేడుకల్లో డిఆర్ఓ రాథోడ్ రమేష్, బిసి, ఎస్సీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఎల్డిఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

రుణ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి
నిర్మల్ జిల్లా,: జిల్లా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను వంద శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బ్యాంకర్లను ఆదేశించారు. అర్హులైన రైతులు, విద్యార్థులు, యువత, మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకురుణాలు సకాలంలో అందేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో 2026–27 వార్షిక రుణ ప్రణాళిక, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరు, ప్రాధాన్యతా రంగాలకు ఆర్థిక సహాయం, సామాజిక భద్రతా పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని బ్యాంకులకు రూ.7,952.87 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.2,331.18 కోట్లు (29.31 శాతం) సాధించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన రూ.6,661.73 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,847.71 కోట్లు (27.74 శాతం) సాధించారని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యా రుణాల మంజూరు తక్కువగా ఉందని పేర్కొన్న కలెక్టర్, అర్హులైన విద్యార్థులకు అధిక సంఖ్యలో రుణాలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని ప్రతి ఒక్కరికీ సెప్టెంబర్‌లోగా ఖాతాలు తెరవాలని సూచించారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, కాస్మోటిక్ ఛార్జీల జమ కోసం లక్ష్యంగా పెట్టుకున్న 3,500 ఖాతాల్లో ఇప్పటికే 1,022 కొత్త ఖాతాలు ప్రారంభించినట్లు తెలిపారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ తదితర పథకాల అమలును కలెక్టర్ సమీక్షించారు. రుణ లక్ష్యాల సాధనకు జిల్లా పరిశ్రమల శాఖ బ్యాంకర్లతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ, పీఎం స్వనిధి రుణాల్లో ఎన్‌పీఏలను తగ్గించేందుకు మున్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించాలని ఎల్‌డీఎంను సూచించారు. మొండి బకాయిల వసూళ్లకు సీబీఆర్‌ఎం బృందాల సేవలను వినియోగించుకోవాలని, అన్ని బ్యాంకులను సమన్వయం చేస్తూ మెరుగైన పనితీరు సాధించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ లక్ష్యాలను పూర్తి చేయడంతోపాటు డిజిటల్ ఎంసీపీ సమస్యలను పరిష్కరించాలని పీడీ డీఆర్‌డీఏకు సూచించారు. విజయ డెయిరీతో టైఅప్ ద్వారా రైతులకు పాడి పశువుల కొనుగోలుకు రుణాలు అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. పాడి పశువులకు అవసరమైన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని జిల్లా పశువైద్యాధికారిని ఆదేశించారు. డెయిరీ యూనిట్లకు బ్యాంకులు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. రైస్ మిల్లుల ఫైనాన్స్‌కు అవసరమైన ఎన్‌ఓసీలు, బ్యాంకు గ్యారెంటీల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై వంటి సామాజిక భద్రతా పథకాల కింద మరణించిన లబ్ధిదారుల కుటుంబాలకు అందిన క్లెయిమ్‌లను విజయగాథలుగా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఎల్‌నినో ప్రభావం జిల్లాలోని క్రెడిట్ పోర్ట్‌ఫోలియోపై ఎలా ఉండొచ్చో అంచనా వేసి నివేదిక అందించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం బి. రామ్‌గోపాల్, ఆర్‌బీఐ ఏజీఎం, ఎల్‌బీఓ ఎస్. రాములు, పీడీ డీఆర్‌డీఏ విజయలక్ష్మి, ఆర్‌ఎం నవీన్ పురం, సీఎం క్రెడిట్ ఆర్‌బీఓ ఆదిలాబాద్ పియూష్, వివిధ బ్యాంకుల అధికారులు, నాబార్డ్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

1.5 ఎకరాల్లో పత్తి పంట ధ్వంసం..
​సారంగాపూర్ :కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికి వచ్చే సమయంలో దుండగుల చేతిలో నాశనమవ్వడంతో ఒక రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పత్తి పంటపై గడ్డిమందు పిచికారీ చేసి పంటను ఎండబెట్టిన ఘటన సారంగాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన రైతు బంగ్లా రాజు రెడ్డి (తండ్రి: ముత్యంరెడ్డి) తన సర్వే నంబర్ 281 లోని 2.5 ఎకరాల భూమిలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. పంట పచ్చగా పెరిగి, చేతికి వచ్చే దశకు చేరింది. గత ఆదివారం రాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు రాజు రెడ్డికి చెందిన చేనులోకి అక్రమంగా ప్రవేశించారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పత్తి పంటపై గడ్డిమందు పిచికారీ చేశారు. మరుసటి రోజు ఉదయం చేను వద్దకు వెళ్లిన రాజు రెడ్డికి పత్తి చెట్లు రంగు మారి ఎండిపోతూ కనిపించాయి. కనుల ముందే పంట నాశనమవ్వడం చూసి బాధితుడు కన్నీరుమున్నీ రయ్యాడు. లక్షల రూపాయలు వెచ్చించి, అహోరాత్రులు కష్టపడి సాగు చేసిన పంటను నాశనం చేసిన దుండగులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని రాజు రెడ్డి డిమాండ్ చేశాడు. ఈ అమానుష ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ :  జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కార ప్రగతిని పరిశీలించారు.ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా పెండింగ్ కేసులన్నింటినీ క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.ఏదైనా సాంకేతిక లేదా ఇతర కారణాలతో దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే, తిరస్కరణకు గల స్పష్టమైన కారణాలను రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే 22ఏ (22A) నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి, నిబంధనల మేరకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుదారులకు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం సేవలు అందించడంతో పాటు భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీల్లో చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
నిర్మల్ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా అన్ని రకాల మౌలిక వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.గురువారం నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.గ్రామాల్లోని చిన్నారులందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రాలను పిల్లలను ఆకట్టుకునే విధంగా రంగురంగుల బొమ్మలు, పెయింటింగ్స్, వర్ణమాల, విద్యా చార్టులతో అలంకరించి, ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్యాబోధన అందించాలని తెలిపారు. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడేలా ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటలు, రైమ్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఎత్తు, బరువు తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి సామ్ , మామ్ కేటగిరీకి చెందిన పిల్లల వివరాలను పకడ్బందీగా నమోదు చేసి, పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి గర్భిణి, బాలింతకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, పోషకాహార సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తనిఖీ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. వారి పేర్లు, చదువు గురించి అడిగి తెలుసుకుని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి రావాలని సూచించారు. చిన్నారులతో రైమ్స్ చెప్పించి, సంఖ్యలు చదివించడంతో పాటు వారికి చాక్లెట్లు అందించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, వైద్యారోగ్య శాఖ అధికారులు పవన్ కుమార్, సౌమ్య, నయనా రెడ్డి, రమేష్, అలీ, సర్పంచ్ హరీష్, ఉప సర్పంచ్ భూమేష్, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆచరణాత్మక విద్యతోనే సృజనాత్మకత
నిర్మల్  : పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక విద్యను అందించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని జిల్లా కలెక్టర్‌ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం తానూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.తరగతి గదులు, వసతిగృహం, పరిసరాలను పరిశీలించిన కలెక్టర్‌, పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు. పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌, మిగిలిన పాఠ్యాంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా సిలబస్‌ పూర్తి చేసి, పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే గుర్తించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. పదో తరగతి విద్యార్థినులతో కలెక్టర్‌ ముఖాముఖిగా మాట్లాడారు. పాఠశాలలో అందుతున్న వసతులు, భోజనం నాణ్యత, చదువులో ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోర్డు మీద గణిత లెక్కలు రాయించి విద్యార్థినుల సామర్థ్యాన్ని పరిశీలించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థినులను అభినందించి పెన్నులను బహుమతిగా అందించారు. పరీక్షల గురించి ఆందోళన చెందకుండా రోజువారీ చదువుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పాఠ్యాంశాల్లో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి వెంటనే నివృత్తి చేసుకోవాలని, అర్థం చేసుకుని చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థినులకు సూచించారు. అంతకుముందు తానూరు మండలం మొగిలి గ్రామంలోని విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో పీఏసీఎల్‌ (పెరల్స్‌ ఆగ్రోటెక్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) భూ బాధిత రైతులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ భూ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. బాధిత రైతుల నుంచి పూర్తి వివరాలను సేకరించి, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, జీపీవోల ద్వారా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే సంబంధిత భూములకు సమగ్ర సర్వే నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యలు ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని కలెక్టర్‌ చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మొగిలి గ్రామంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి గ్రామస్థులు అందించిన వినతిని కలెక్టర్‌ స్వీకరించారు. సమస్యను పరిశీలించి త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విఠలేశ్వర ఆలయంలో కలెక్టర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్‌ మహేందర్‌నాథ్‌, ఎంపీడీవో శ్రీధర్‌, ఏఎంసీ ఛైర్మన్‌ షిండే ఆనంద్‌రావు పటేల్‌, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సర్పంచ్‌ ఉష, ఉపసర్పంచ్‌ నితిన్‌, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

కిషోర్ కుమార్ సేవలు మరువలేనివి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్  : బదిలీలు, పదవీ విరమణలు ఉద్యోగ జీవితంలో సహజమేజిల్లాకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కిషోర్ కుమార్ అందించిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీలు, పదవీ విరమణలు సహజమని పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ వరంగల్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలిగ్ అహ్మద్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్స్ నరసింహమూర్తి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కిషోర్ కుమార్ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా భూ సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోళ్లు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లను సకాలంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయడంలో ఆయన కీలకంగా పనిచేశారని అభినందించారు. వరంగల్ జిల్లాలోనూ ఇదే అంకితభావంతో పనిచేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.అలాగే, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాలిగ్ అహ్మద్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్స్‌గా నరసింహమూర్తి సుదీర్ఘకాలం క్రమశిక్షణతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని కలెక్టర్ తెలిపారు. అనుభవజ్ఞులైన ఈ అధికారులు పదవీ విరమణ చేయడం జిల్లాకు లోటేనని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా భావి జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

వీడ్కోలు సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తన విధుల నిర్వహణలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం, ప్రజావాణి నిర్వహణ, ఎన్నికల విధులు, వరదల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రతి అధికారి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.పదవీ విరమణ పొందిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలిగ్ అహ్మద్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్స్ నరసింహమూర్తి మాట్లాడుతూ, తమ ఉద్యోగ జీవితంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.