Legal - Vision Andhra

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి జూలై 31 వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్-XII కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను రక్షించగా, వారిలో 269 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాలు, ఇటుక బట్టీలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకోసం కమిషనరేట్ పరిధిలోని 9 సబ్‌డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక ఎస్‌ఐను ఇన్‌చార్జిగా నియమించి, మొత్తం 9 మంది ఎస్‌ఐలు, 36 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సిబ్బందితో పాటు వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, కార్మిక శాఖ అధికారులు, అలాగే షేర్ (SHARE), స్కోప్ (SCOPE), FMM SSS స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు.

ఈ సంయుక్త చర్యల్లో భాగంగా 226 మంది బాల కార్మికులను, 85 మంది పాఠశాల మానేసిన (డ్రాప్‌అవుట్) చిన్నారులను గుర్తించి రక్షించారు. అనంతరం వారిని వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచి, పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కమిటీ ఆదేశాల మేరకు అప్పగించినట్లు తెలిపారు.

రక్షించబడిన చిన్నారుల్లో బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 130 మంది చిన్నారులు కూడా ఉన్నారని కమిషనర్ వెల్లడించారు.

చిన్నారులతో అక్రమంగా పని చేయిస్తున్న యజమానులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 55 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 92 ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు (Inspection Reports) కార్మిక శాఖ అధికారులు నమోదు చేశారని, వివిధ పోలీస్ స్టేషన్ల జనరల్ డైరీల్లో 118 మంది చిన్నారుల వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, "పిల్లలు బడిలో ఉండాలి కానీ పనిలో కాదు. బాల్యానికి అండగా నిలవడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశ్యం. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు," అని హెచ్చరించారు.

చిన్నారుల హక్కుల పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (WCD), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), కార్మిక శాఖ, విద్యాశాఖ, షేర్ (SHARE), స్కోప్ (SCOPE), FMM SSS స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు పాల్గొని విజయవంతం చేసినట్లు కమిషనర్ తెలిపారు.

బెయిల్ అంటే ఏమిటి...!
హైదరాబాద్  :  "బెయిల్" అంటే పోలీసు నిర్బంధం నుంచి గాని న్యాయస్థానం ఆధీనంలోంచి గాని తన స్వంత పూచీపై లేదా ఇతరులు పూచీపై పోలీసులు లేదా కోర్టు ఎప్పుడు హాజరవమంటే అపుడు హాజరవుతానని ఒప్పుకొని తాత్కాలికంగా నిర్బంధం నుంచి తప్పుకోవడం. అంటే పోలీసు లేదా కోర్టు అధీనం నుంచి తాత్కాలికంగా విడుదల కావడం.

బెయిలు దొరికేది దొరకనిది అంటూ ఉంటుందా?

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నేరాలను రెండు రకాలుగా విభజించారు. ఒకటి-బెయిలు దొరికేది రెండు బెయిలు దొరకనిది. ఈ రెండింటిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక పట్టీలో చూపడం జరిగింది. సామాన్యంగా శిక్ష మూడు సంవత్సరాలకు మించ కుండా ఉంటే అందులో బెయిల్ దొరుకుతుంది. కొన్ని మూడు సంవత్సరాలకంటే. ఎక్కువ ఉన్నా బెయిలు దొరికేవి ఉన్నాయి. అలాగే కొన్నింటిలో శిక్ష మూడు సంవత్స రాలకంటే తక్కువ ఉన్నా కూడా దొరకనివి ఉన్నాయి. అందులో బెయిలు దొరికేవి అని ఉంటే బెయిలు ఖచ్చితంగా ఇవ్వాలి. అది మీ హక్కు. బెయిలు దొరకనివి అని అంటే కోర్టువారు ఇస్తేనే మీకు దొరుకుతుంది.

బెయిలు ఎలా దొరుకుతుంది ?

మిమ్మల్ని అరెస్టు చేశారనుకోండి. ఎందుకు అరెస్టు చేశారో పోలీసువారు మీకు చెప్పాలి. ఏ నేరారోపణపై మిమ్మల్ని పట్టుకున్నది చెప్పాలి. పోలీసు స్టేషన్కు తీసుకు వచ్చిన తర్వాత మీకు బెయిలు దొరుకుతుందా, లేదా అనే విషయం కూడా పొలీసువారు మీకు చెప్పాలి. బెయిలు దొరికే నేరమయితే "మీకు బెయిలు దొరుకుతుంది, తీసుకుంటారా అని అడగాలి. మీకు బెయిలు కావాలని అడిగితే స్వంత పూచీకత్తుపై గాని, జామీను పై గాని మిమ్మల్ని విడిచి పెట్టాలి.

జామీను కావాలంటే ఎలాగ ? మీరు జామీను ఎలా తీసుకువస్తారు ? మీరు నిర్బంధంలో ఉన్నారుకదా ! మీ జామీను ఇచ్చే వారిని జామీను ఇస్తారా అని మరి అటువంటపుడు ఎలాగ ? అందుకనే మిమ్మల్ని పోలీసు వారు అడిగి జమీనుదార్లను పోలీసు స్టేషనుకు పిలిపించాలి. వారు వచ్చిన తర్వాత వారిని అడిగి మిమ్మల్ని విడిచి పెట్టాలి. అంటే అరెస్టు చేసి, మీకు బెయిలు దొరుకుతుంది అని చెప్పి, దానికి కావలసిన జమానతుదార్లను పిలిపించి మిమ్మల్ని బెయిలు మీద విడిచి పెట్టాలి.  ఇవన్నీ పోలీసువారు చేయవలసినవే. క్రిమినల్ ప్రొసీజర్. కోడ్ --సెక్షన్ 50 ఆ విధంగా చెబుతున్నది. ఒక వేళ బెయిలు దొరకని నేరమయితే పోలీసువారు మిమ్మల్ని కోర్టు ముందు హాజరు పరుస్తారు. పైన చెప్పిన ప్రకారం మిమ్మల్ని అరెస్టు చేసిన 24 గం. లోగా  మిమ్మల్ని కోర్టుముందు హాజరుపరచాలి. అపుడు మీరు కోర్టు ద్వారా బెయిలు పొందవచ్చు.